Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఇంటికి చంద్రబాబు వెళ్లెదెప్పుడు..?
By: Tupaki Desk | 15 Oct 2015 8:18 AM GMTఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్లి తాను స్వయంగా ఆహ్వానిస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించటం తెలిసిందే. చంద్రబాబు ప్రకటన విన్న వెంటనే.. ఆ విషయాన్ని కేసీఆర్ చెవిన వేశారు తెలంగాణ అధికారులు. ఈ మాట విన్న వెంటనే.. ఏ సమయంలో అన్న విషయాన్ని తెలుసుకొని తల పంకించి ఉండిపోయిన విషయం తెలిసిందే.
చంద్రబాబు ప్రకటనతో..కేసీఆర్ ఇంటికి బాబు వెళ్లే క్షణాల కోసం అందరిలో ఆసక్తి వ్యక్తమవుతోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత రెండురాష్ట్రాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉండటం.. రాజకీయం రెండు పక్షాల మధ్య విభేదాలు రాష్టాల సంబంధాల మీద పడటం తెలిసిందే.
ఇక.. ఓటుకు నోటు.. ఫోన్ ట్యాపింగ్ పరిణామాలతో ఒకరినొకరు ఎదురుపడేందుకు సైతం ఇష్టపడకపోయే వరకూ విషయం వెళ్లటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరి చంద్రుళ్ల మధ్య వార్ మరింత పెరిగింది. ఫోన్ ట్యాపింగ్.. ఓటుకు నోటు వ్యవహారం వరకూ హైదరాబాద్ లోనే మకాంవేసిన చంద్రబాబు ఆ తర్వాత ఏపీకి వెళ్లిపోవటం.. తన ఫోకస్ మొత్తం అక్కడే పెట్టటం జరిగింది.
శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానిస్తానని చంద్రబాబు స్వయంగా చెప్పటంతో.. ఆయన ఎప్పుడు ఆహ్వానం పలుకుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో తాజాగా కేసీఆర్ కుమారుడు.. తెలంగాణ రాష్ట్ర మంత్రి స్పందిస్తూ.. తమను ఆహ్వానిస్తే అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తాము వెళతామని ప్రకటించటంతో ఈ ఉత్కంఠ మరింత పెరిగింది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఈ నెల 18న (ఆదివారం) అందరూ ఎదురుచూసే మహా కలయిక ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటికి చంద్రబాబు వెళ్లి.. మీడియాసమావేశంలో పేర్కొన్న విధంగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానిస్తారని చెబుతున్నారు.
ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు గవర్నర్ నరసింహనన్.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బాబా సాహెబ్ భోసలే.. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావును స్వయంగా కలిసి ఆహ్వానం అందిస్తారని భావించారు. అయితే.. ఆదివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అందుబాటులో ఉండన్న విషయాన్ని తెలుసుకున్న ఏపీ సర్కారు.. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిని పంపి ఆహ్వానం అందించింది. చూస్తుంటే.. ఆదివారం మొత్తం ప్రముఖుల్ని పిలవటంలో చంద్రబాబు బిజీబిజీగా ఉండేటట్లున్నారే.