Begin typing your search above and press return to search.

అమెరికాలో టెకీ డెడ్ బాడీ.. తెచ్చేదెప్పుడు?

By:  Tupaki Desk   |   7 Aug 2019 10:26 AM GMT
అమెరికాలో టెకీ డెడ్ బాడీ.. తెచ్చేదెప్పుడు?
X
రెండు రోజుల క్రితం అమెరికాలో యాక్సిడెంట్.. ప్రకాశం జిల్లాకు చెందిన యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చింతల శివతేజ (26) మృతి చెందాడు. రెండు రోజుల క్రితం ఈ సంఘటన జరిగింది. అయినా డెడ్ బాడీ ఇంకా ఆస్పత్రిలోనే ఉంది. దీంతో ఎప్పుడు వస్తుందోనని కుటుంబసభ్యులు బోరుమంటున్నారు.

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొమ్మినేని వారిపాలేనికి చెందిన రామాంజనేయులు, వెంకటరత్నం దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. మూడో కుమారుడు శివతేజ ఆరేళ్ల క్రితం అమెరికా వెళ్లి ఎంఎస్ పూర్తి చేశాడు. అక్కడే సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదించి కొల్టేడు ప్రాంతంలో పనిచేస్తున్నాడు.

కాగా రెండు రోజుల క్రితం సహచర ఉద్యోగితో కలిసి ఆఫీసుకు వెళ్తుండగా కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో శివతేజతోపాటు అతడి సహచర ఉద్యోగి మృతిచెందారు.

రెండు రోజులుగా శివతేజ మృతదేహం ఆస్పత్రిలోనే ఉంది. మంగళవారం సమాచారం అందుకున్న మృతుడి బంధువులు ఆస్పత్రికి వెళ్లి శివతేజ సోదరికి ప్రియాంకకు సమాచారమిచ్చారు. కాగా ఇండియాకు తీసుకురావడంలో జాప్యం జరుగుతుండడం.. వివిధ ఫార్మాలటీస్ ఉండడం.. అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో శివతేజ కుటుంబం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వం, ఎన్ఆర్ఐ సంఘాలు త్వరగా మృతదేహాన్ని ఇండియాకు తరలించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.