Begin typing your search above and press return to search.

క్వీన్ ఎలిజబెత్ 2 వెళ్లిపోయిన వేళ.. పట్టాభిషేకం జరిగేదెప్పుడు?

By:  Tupaki Desk   |   9 Sep 2022 3:28 AM GMT
క్వీన్ ఎలిజబెత్ 2 వెళ్లిపోయిన వేళ.. పట్టాభిషేకం జరిగేదెప్పుడు?
X
తరతరాలకు సుపరిచితురాలైన క్వీన్ ఎలిజబెత్ 2 గురువారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 96 ఏళ్ల వయసులో తిరిగి రాని లోకాలకు పయనమై వెళ్లిపోయిన వైనం తెలిసిందే. ఆమె వారసుడి ఎంపిక ఎప్పుడు? వారి పట్టాభిషేకం సంగతేమిటి? లాంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం క్వీన్ ఎలిజబెత్ 2 వారసుడి ప్రకటన వెంటనే వెలువడుతుందని చెబుతున్నారు.

ముందు నుంచి తెలిసిన ప్రకారమే ప్రిన్స్ చార్లెస్.. క్వీన్ ఎలిజబెత్ 2 వారుసుడిగా మారతారు. అయితే.. ఆయన పట్టాభిషేకానికి మాత్రం కాస్తంత సమయం తీసుకుంటారని చెబుతున్నారు.

బ్రిటన్ చట్టాలు.. సంప్రదాయం ప్రకారం రాజు లేదంటే రాణి కన్నుమూసిన తర్వాత 24 గంటల వ్యవధిలోనే వారసుడ్ని ప్రకటించాల్సి ఉంటుంది. దీని కోసం సీనియర్ మంత్రులు.. న్యాయమూర్తులు.. మత పెద్దలు సమావేశమవుతారు.

అనంతరం పార్లమెంటును సమావేశ పరుస్తారు. శాసన కర్తలు అంతా కూడా కొత్త రాజుకు తమ విధేయత ప్రదర్శిస్తూ ప్రకటన విడుదల చేస్తారు. అనువంశిక రాజరిక చట్ట నిబంధనల ప్రకారం కొత్తగా ఎంపికైన వారు తమ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేపడతారు.

అయితే.. ఇది ఇప్పటికిప్పుడు జరగదని చెబుతున్నారు. కొత్త రాజు ప్రకటన గంటల వ్యవధిలో వెలువడినప్పటికీ.. పట్టాభిషేకానికి మాత్రం కొద్ది నెలల సమయం తీసుకుంటారని చెబుతున్నారు. దీనికి కారణం.. పట్టాభిషేకానికి అనుసరించాల్సిన ప్రక్రియ సుదీర్ఘంగా ఉండటమేనని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.