Begin typing your search above and press return to search.
చిన్నమ్మ రిలీజ్.. చెన్నైకి వచ్చేదెప్పుడంటే?
By: Tupaki Desk | 27 Jan 2021 10:30 AM GMTచిన్నమ్మను విపరీతంగా అభిమానించే నేతలు.. కార్యకర్తలు.. అభిమానులకు మామూలుగా అయితే ఇది పండుగలాంటి రోజు. కానీ.. బ్యాడ్ లక్ వారిని వెంటాడుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్లుగా జైలుశిక్ష అనుభవించిన ఆమె.. ఈ రోజు విడుదలయ్యారు. ఈ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నప్పటికీ.. కరోనా కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. ఆసుపత్రిలోనే విడుదలైనట్లుగా అధికారులు పేర్కొన్నారు. అధికారిక లాంఛనాలు పూర్తి కావటంతో.. ఆరోగ్యం కుదుటపడిన వెంటనే ఆమె బయటకు వచ్చే వీలుంది.
ప్రస్తుతం బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం జైలు అధికారులు ఆసుపత్రికి వచ్చి.. విడుదలకు సంబంధించిన అధికారిక పత్రాల్ని ఆమెకు అందజేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మరికొద్దిరోజులు ఆమె ఆసుపత్రిలోనే ఉంటారని చెబుతున్నారు. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత మరో ఆసుపత్రికి వెళతారంటున్నారు. అనంతరం పది రోజుల పాటు బెంగళూరులోనే ఉండి.. పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత చెన్నైకి బయలుదేరే వీలుందని చెబుతున్నారు.
మరికొద్ది నెలల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చిన్నమ్మ ఎంట్రీ తమిళ రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్నట్లు చెబుతున్నారు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఫిబ్రవరి మొదటి వారాంతంలో కానీ.. రెండో వారం మొదట్లో కానీ.. ఆమె చెన్నైకి రానున్నారు. ఆమెకు స్వాగతం పలికేందుకు వందలాది వాహనాలతో భారీ ర్యాలీ చేపట్టాలని భావిస్తున్నారు.