Begin typing your search above and press return to search.
సుష్మ జీవితంలో ఎమర్జెన్సీ ‘లవ్ స్టోరీ’ ఇదే
By: Tupaki Desk | 7 Aug 2019 6:46 AM GMTగొప్ప మానవతావాది - మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ను అనారోగ్యం కబళించింది. ఎవ్వరూ తలుపుతట్టినా.. ట్వీట్ చేసినా సహృదయంతో స్పందించి కేంద్ర విదేశాంగ మంత్రిగా ఆమె చేసిన సేవలు వెలకట్టలేనివి. గీతాసింగ్ లాంటి యువతిని పాకిస్తాన్ నుంచి ఇంటికి చేర్చింది ఇదే సుష్మస్వరాజ్. ఇక పాకిస్తాన్ చిన్నారి గుండె ఆపరేషన్ చేయించిన మానవతావాది. శత్రుదేశం పాకిస్తాన్ పై కూడా కరుణ చూపి ఆ అన్నార్థులను ఆదుకున్న తల్లిలా ఆదుకొని సుష్మ ఎనలేని ఖ్యాతి గడించారు. అయితే ఫైర్ బ్రాండ్ సుష్మ మరణం ఇప్పుడు అందరినీ కలిచివేసింది. సుష్మ బయోగ్రఫీపై ఇప్పుడు అందరూ వెతుకులాట ప్రారంభించారు. ఇంతకీ సుష్మ జీవితంలో ఓ తియ్యని లవ్ స్టోరీ ఉంది. అదేంటో తెలుసుకుందాం..
అది సుష్మ స్వరాజ్ కాలేజీ రోజులు.. ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయం శాస్త్రం చదువుతోంది. అప్పుడే స్నేహితుడిగా పరిచయం అయ్యాడు స్వరాజ్ కౌశల్. ఇద్దరి పరిచయం - సోషలిస్టు భావజాలం కలిసింది. దీంతో ప్రేమ చిగురించింది. వారిద్దరిని ఒక్కటి చేసింది. అది వివాహానికి దారితీసింది.
అయితే ప్రేమ చిగురించిన పెళ్లి మాత్రం అంత ఈజీగా జరగలేదు. ఇద్దరూ కాలేజీ చదువులు అయిపోయాక సుష్మ - స్వరాజ్ కౌశల్ లు న్యాయవాదులుగా సుప్రీం కోర్టులో న్యాయవాదులుగా వృత్తిని ప్రారంభించారు. నాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు జార్జి ఫెర్నండేజ్ కేసును టేకప్ చేసిన లాయర్లలో వీరిద్దరూ ఉండి చిక్కులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో అండగా నిలిచిన స్వరాజ్ కౌశల్ తో 1975 జూలై 13న వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ వీరి పెళ్లికి ఇరుకుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.
సుష్మ స్వరాజ్ సంప్రదాయ హర్యానా కుటుంబం.. సుష్మ ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. ఎదురించి స్వరాజ్ కౌశల్ ను పెళ్లి చేసుకుంది. తర్వాత తన ఇంటి పేరును స్వరాజ్ గా మార్చుకుంది. వీరిద్దరికి బన్సూరి స్వరాజ్ అనే అమ్మాయి ఉంది. ఇక కిడ్నీలు ఫెయిల్ అయిన నేపథ్యంలో సుష్మ ఈసారి కేబినెట్ లోకి వద్దని భర్తతో కాలం గడుపుతానని చెప్పి మోడీ కేబినెట్ లో చేరలేదు. చివరకు మోడీ రెండోసారి ప్రధాని మహోత్సవానికి హాజరయ్యారు. ఇక కశ్మీర్ విభజనపై చివరి సారి ట్వీట్ చేశారు. ఆ తర్వాత గుండెపోటుతో మరణించారు. ఇటీవల 44వ వైవాహిక వేడుకలను జరుపుకున్నారు.