Begin typing your search above and press return to search.

నోట్ల కట్టలపై గాంధీ.. అసలు ఎప్పుడొచ్చారు?

By:  Tupaki Desk   |   2 Oct 2020 2:30 PM GMT
నోట్ల కట్టలపై గాంధీ.. అసలు ఎప్పుడొచ్చారు?
X
భారత్ ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చిందంటే అది మహాత్ముడి ఘనతే. అహింసా మార్గంలో భారతదేశానికి బ్రిటీష్ వలస పాలన నుంచి విముక్తి కల్పించిన మహనీయుడు మన గాంధీజి. అందుకే మన జాతిపిత అయ్యారు. గాంధీ వల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అందుకే ఆయన జయంతి నాడు అందరం ఆయనను స్మరించుకుంటున్నారు.

భారత ప్రధాని మోడీ నుంచి కేసీఆర్, జగన్ సహా అందరూ బాపూజీకి నివాళులర్పించారు. మహాత్ముడి గొప్పతనాన్ని చాటారు. అయితే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అప్పటిదాకా బ్రిటీష్ వారి కరెన్సీని దేశంలో రద్దు చేశారు. బ్రిటీష్ రాజు ఫొటోను కరెన్సీ నోటుపై తీసేశారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక బ్రిటీష్ రాజు స్థానంలో గాంధీ ను ముద్రించాలని తొలుత మన నాయకత్వం భావించారు. కానీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మూడు సింహాల చిహ్నాన్ని ముద్రించారు.

మొదట స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో భారత కరెన్సీపై తంజావురు గుడి, గేట్ వే ఆఫ్ ఇండియా లాంటివి మన కరెన్సీ నోట్లపై ఉండేవి. అయితే 1969లో గాంధీ శత జయంతి సందర్భంగా ఆయన చిత్రంతో 5 రకాల నోట్లను దేశంలో చెలామణిలోకి తెచ్చారు.

ఇక 1987 తరువాత ఎక్కువగా గాంధీ నోట్లు మాత్రమే రాసాగాయి. చివరకు 1996లో ఆర్బీఐ పూర్తిగా మహాత్మాగాంధీ ఫొటోలతోనే గాంధీ సిరీస్ నోట్లను ఆవిష్కరించింది. ఇలా భారత జాతిపిత కరెన్సీ నోట్లపై చిరస్థాయిగా ఉండిపోయారు.