Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీ కి , ముఖ్యమంత్రులకి వ్యాక్సిన్ ఇచ్చేది ఎప్పుడంటే ?

By:  Tupaki Desk   |   21 Jan 2021 11:31 AM GMT
ప్రధాని మోడీ కి , ముఖ్యమంత్రులకి  వ్యాక్సిన్ ఇచ్చేది ఎప్పుడంటే ?
X
దేశంలో తొలి దశ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ సాగుతుంది. జనవరి 16 నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్నిపెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. తోలి దశలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు సహా ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్ ‌కు వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే ప్రధాని మోడీ , ముఖ్యమంత్రులకి ఎప్పుడు టీకా ఇస్తారని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ పై ఉన్న అనుమానాలు తొలగించడానికి ప్రధానులే తోలి టీకా వేసుకున్న నేపథ్యంలో మోడీ ఎందుకు ఇంకా టీకా తీసుకోలేదు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ విమర్శలకి ప్రధాని కార్యాలయం ఓ స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది.

రెండో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ ‌లో ప్రధాని మోదీ టీకా తీసుకుంటారని పీఎంవో అధికారి ఒకరు వెల్లడించినట్లు ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. రెండో దశ వాక్సినేషన్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు టీకా వేసుకోనున్నారు. ఇది మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు సమాచారం. ఆ డ్రైవ్‌ లో సుమారు 27 కోట్ల మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

రెండో దశలో 50 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని ఇప్పటికే భారత ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని మోదీతో పాటు చాలా మంది సీఎంలు, మంత్రులు, ఎంపీలు.. అదే ఏజ్ గ్రూప్‌లో ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు కూడా ఈ జాబితాలో ఉండబోతుంది. అయితే ఏపీ సీఎం జగన్ కి 48 ఏళ్లే కావడం తో సీఎం జగన్ కి రెండో దశలో వ్యాక్సిన్ ఇస్తారో లేదో అనే విషయం పై ఓ క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రస్తుతం మన దేశంలో సీరం ఇన్‌ స్టిట్యూట్‌ కు చెందిన కోవిషీల్డ్ , భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ ‌లను వినియోగిస్తున్నారు. ఈ రెండు వాక్సిన్‌ లను డీసీజీఐ ఆమోద ముద్రవేయడంతో.. జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమయింది. ఇది ప్రపంచలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్. అన్ని రాష్ట్రాల్లో తొలిదశ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొసాగుతోంది. ఈ దశలో 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ ‌కు టీకా వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.