Begin typing your search above and press return to search.
తెలుగు రాజకీయాల్లో ఇలాంటి సీన్ ఎప్పటికి కనిపిస్తుందో?
By: Tupaki Desk | 14 May 2021 4:30 AM GMTఅత్యున్నత స్థానాల్లో కూర్చోవాలన్న తపన అందరికి ఉంటుంది. కానీ.. దాన్ని అందిపుచ్చుకోవటం అంత తేలిక కాదు. కానీ.. ఎంతోకాలంగా వేచి చూసిన ఉదయం వచ్చినప్పుడు.. సదరు అధినేత తీరు ఎలా ఉంటుందన్న విషయాన్ని చూడాలంటే.. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. స్టాలిన్ ఏమి సుద్దపూస ఏమీ కాదు. ఆయన రాజకీయ జీవితాన్ని చూస్తే.. ఎన్నో వివాదాలు.. ఎదురుదెబ్బలు కనిపిస్తాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలన్న ఆయన కోరిక.. 68 ఏళ్ల వయసులో కానీ తీరలేదు. చూసేందుకు అరవై ప్లస్ లా కనిపిస్తారు కానీ.. మనిషి ఎత్తుగా ఉండటం.. అందుకు తగ్గట్లు స్ట్రాంగ్ గా ఉండటంతో అంత వయసున్న నేతగా అనిపించరు. ఎట్టకేలకు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతల్ని చేపట్టారు.
పదవిని చేపట్టిన వెంటనే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా మారుతున్నయి. వినూత్నంగా ఉంటున్నాయి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో విపక్ష నేత ఇంటికి.. ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లటం లాంటివి ఉంటాయా? ఆ మాటకు వస్తే.. ఏదైనా వినతిపత్రాన్ని ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కార్యాలయానికో.. ఇంటికో వెళితే.. టైం కూడా ఇవ్వని పరిస్థితి. అందుకు భిన్నంగా ప్రతిపక్ష నేత పన్నీర్ సెల్వం ఇంటికి నేరుగా వెళ్లిన స్టాలిన్.. సరికొత్త రాజకీయ ఎత్తుగడను ప్రదర్శిస్తున్నారని చెప్పాలి.
రాజకీయాల్లో వ్యక్తిగత వైరం ఎంతలా ఉంటుందనటానికి తమిళనాడు రాజకీయాలు నిలువెత్తు రూపంగా కనిపిస్తాయి. అలాంటిది.. రాజకీయ శత్రువు వేరు.. రాజకీయ ప్రత్యర్థి వేరన్న విషయాన్ని తన చేతలతో చేసి చూపించటమే కాదు.. పాత రాజకీయాల్ని వదిలేసి.. సరికొత్తగా అడుగులు వేద్దామన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నంతనే తనకు మించినోళ్లు లేరన్న భావనకు పోకుండా.. అందరిని కలుపుకుపోయేలా వేసే అడుగుల్ని చూస్తే.. ఈ తరహా రాజకీయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కనిపిస్తుందా? అన్న భావన కలుగక మానదు. అలాంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటికైనా కనిపించే అవకాశం ఉందంటారా?