Begin typing your search above and press return to search.
ఏపీలో టీఆర్ఎస్ ఎప్పుడు ప్రారంభిస్తారు ?
By: Tupaki Desk | 4 Nov 2021 12:30 AM GMTఏపీలో కూడా తనను టీఆర్ఎస్ శాఖను ప్రారంభించాలని వేలాది విజ్ఞప్తులు వస్తున్నాయి. పార్టీని ఏర్పాటుచేస్తే ఎన్నికల్లో దగ్గరుండి గెలిపించుకుంటామని తనను వేలాదిమంది జనాలు ఒకటే ఒత్తిడి పెడుతున్నట్లు కేసీయార్ కలరింగ్ ఇచ్చారు. ఈమధ్యనే జరిగిన పార్టీ ప్లీనరీ సందర్భంగా కేసీయార్ పై వ్యఖ్యాలు చేశారు. నిజానికి ఏపీలో పార్టీని విస్తరించే ఆలోచన కేసీయార్లో ఉందో లేదో తెలీదుకానీ హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంతో వ్యూహాత్మకంగా ఓ ప్రకటనైతే చేశారు.
కేసీయార్ ప్రకటనలో రాజ్యవిస్తరణ కాంక్షతో పాటు అహంకారమే ఎక్కువగా కనిపిస్తోందంటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లాంటి కొందరు నేతలు మండిపడ్డారు. అయినా కేసీయార్ పట్టించుకోలేదు. హుజూరాబాద్ ఉపఎన్నికలో లబ్దిపొందేందుకే కేసీయార్ పై వ్యాఖ్యలు చేసినట్లు అర్ధమవుతోంది. నిజంగానే ఏపీలో టీఆర్ఎస్ శాఖను ప్రారంభిస్తే జనాలు ఆదిరస్తారా ? అన్నది వేరే విషయం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయింది.
ఉపఎన్నిక యావత్తు హోరాహోరీగా సాగింది. కేసీయార్-ఈటల మధ్య పోటీ అన్నట్లుగా ఉత్కంఠగా జరిగిన పోరులో చివరకు బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసిన ఈటల రాజేందర్ 23,865 ఓట్ల మెజారిటితో కంఫర్టబుల్ గా గెలిచారు. దీంతో కేసీయార్ గొంతే కాదు యావత్ టీఆర్ఎస్ నేతల గొంతులు కూడా మూగబోయాయి. సరిగ్గా ఇదే సమయంలో టీఆర్ఎస్ శాఖను ఏపీలో కేసీయార్ ఎప్పుడు ప్రారంభిస్తారంటు సోషల్ మీడియాలో ఓ రేంజిలో సెటైర్లు పేలుతున్నాయి.
ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియాలో కేసీఆర్ వ్యతిరేకులు రెచ్చిపోతున్నారు. ఏదో నోటికొచ్చింది మాట్లాడేయటం కాదని నిజంగానే ఏపి నుండి వేలాది విజ్ఞప్తులు వచ్చింది నిజమే అయితే ఏపీలో టీఆర్ఎస్ శాఖను ఎప్పుడు ప్రారంభించేది కేసీయార్ వెంటనే చెప్పాలంటు నెటిజన్ల డిమాండ్లు చేస్తున్నారు. అలాగే దళిత బంధు పథకాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు అమలు చేస్తున్నారు ? బీసీ బంధు పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా చెప్పాలంటు నిలదీస్తున్నారు.
ఉపఎన్నికలో గెలుపు టార్గెట్ తోనే కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల తర్వాత పథకం అమలుపై అనేక సందేహాలున్నాయి. దళితుల్లో కూడా ఈ పథకం అమలుపై సందేహాలున్నాయేమో తెలీదు. అయితే ఉపఎన్నికలో దళితులే టీఆర్ఎస్ కు ఓట్లేయలేదని స్పష్టమైపోయింది. నియోజకవర్గంలోని ఏ గ్రామంలో అయితే కేసీయార్ పథకాన్ని ప్రారంభించారో ఆ గ్రామంలోనే టీఆర్ఎస్ కు ఓట్లుపడలేదు.
అంటే దళితులు కూడా కేసీయార్ ను నమ్మలేదని దీంతో అర్ధమవుతోంది. ఒక్క ఎస్సీలే కాదు ఏ వర్గం కూడా కేసీయార్ ను నమ్మలేదని స్పష్టమైంది. మరిలాంటి నేపధ్యంలోనే ఏపీలో టీఆర్ఎస్ ఎప్పుడు ప్రారంభిస్తారని జనాలు అడుతున్నారు.