Begin typing your search above and press return to search.

హ‌రికృష్ణ‌ను ఎందుకు వైఎస్ అభినందించారంటే

By:  Tupaki Desk   |   30 Aug 2018 1:53 PM GMT
హ‌రికృష్ణ‌ను ఎందుకు వైఎస్ అభినందించారంటే
X
తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నాలుగో కుమారుడు - ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి - టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు - ప్రముఖ సినీనటుడు నందమూరి హరికృష్ణ (61) నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించిన సంగ‌తి తెలిసిందే. అనూహ్య రోడ్డు ప్ర‌మాదంలో ఆయ‌న క‌న్నుమూయ‌డం ఎంద‌రినో క‌లిచివేసింది. ఈ సంద‌ర్భంగా హ‌రికృష్ణ‌తో త‌మ‌కున్న అనుబంధాన్ని ప‌లువురు నెమ‌రు వేసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ప్రముఖ దర్శకుడు వి సముద్ర అనేక ఆస‌క్తిక‌ర అంశాల‌ను పంచుకున్నారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి హ‌రికృష్ణ ని అభినందించార‌ని తెలిపారు. రైతు స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న పోషించిన క్రియాశీల పాత్ర‌ను వైఎస్ ప్ర‌త్యేకంగా కొనియాడార‌ని గుర్తు చేశారు.

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో పాటుగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందించేందుకుక హ‌రికృష్ణ అనేక సినిమాల‌ను నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో టైగ‌ర్ హ‌రిశ్చంద్ర‌ప్ర‌సాద్ పేరుతో రైతు సమస్యల పై 2003లో ఓ సినిమాను హ‌రికృష్ణ నిర్మించారు. ఈ సినిమా నిర్మాణం నాటి ప‌రిస్థితుల‌కు స‌ముద్ర గుర్తు చేసుకుంటూ తాను, పోసాని కృష్ణమురళి కలిసి ఎంతో పరిశోధన చేసి రైతుల స‌మ‌స్య‌ల‌పై సినిమా చేసాము అన్నారు . తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు పాల‌న‌లో అన్న‌దాత‌లు ఎదుర్కుంటున్న స‌మ‌స్య‌ల గురించి ప్ర‌త్యేకంగా వివ‌రించార‌ని గుర్తుచేసుకున్నారు. రైతుల స‌మ‌స్య‌ల‌పై ఆ సినిమా చూసి చ‌లించిన అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌త్యేకంగా హ‌రికృష్ణ‌కు ఫోన్ చేశార‌ని గుర్తు చేసుకున్నారు.

అన్న‌దాత‌ల స‌మ‌స్య‌ల‌పై మీరు నిర్మించిన చిత్రం భాగుంద‌ని వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌శంసించార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌న ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని తెలిపిన వైఎస్ అప్పుడు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరిద్దామ‌ని తెలిపార‌ని స‌ముద్ర‌ గుర్తు చేసుకున్నారు. రైతు స‌మ‌స్య‌ల‌ను విష‌యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ప్ర‌స్తావిస్తూ త‌న పాద‌యాత్ర‌లో ఎండ‌గ‌ట్టిన వైఎస్ అనంత‌రం ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించార‌ని తెలిపారు.