Begin typing your search above and press return to search.

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో తెలుగు రాష్ట్రాల సీఎం లు ఎటువైపు?

By:  Tupaki Desk   |   13 Jun 2021 10:30 AM GMT
రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో తెలుగు రాష్ట్రాల సీఎం లు ఎటువైపు?
X
దేశ ప్ర‌ధ‌మ పౌరుడు రాష్ట్ర‌ప‌తి. ప్ర‌స్తుతం ఈ ప‌ద‌విలో ఉన్న రామ్‌నాథ్ కోవింద్ ప‌ద‌వీ కాలం వ‌చ్చే ఏడాదితో ముగియ‌నుంది. దీంతో ఈలోపు.. రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి ఎన్నిక నిర్వ‌హించాల్సి ఉంది. అయితే.. ఇదేమీ ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. ఎల‌క్టోర‌ల్ కాలేజీలో స‌భ్యులైన ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లు అత్యంత కీల‌కం. అయితే.. ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ.. ప్రాంతీయ పార్టీలే బ‌లంగా ఉన్నాయి. దీంతో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో వీరి పాత్రే ఎక్కువ‌. ఫ‌లితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ.. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిని నిల‌బెడితే.. ఎల‌క్టోల‌ర్ కాలేజీల మ‌ద్ద‌తు త‌ప్ప‌నిస‌రి.

ప్ర‌స్తుతం కాంగ్రెస్ కు రాష్ట్రాల్లో బ‌లం లేకుండా పోయింది. దీంతో ఈ పార్టీ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిని ఒంట‌రిగా ప్ర‌క‌టించే అవ‌కాశం లేదు. దీంతో యూపీఏ కూట‌మితో క‌లిసి పోటీకి దిగే అవ‌కాశం ఉంది. ఇక‌, బీజేపీ విష‌యానికి వ‌స్తే.. యూపీ స‌హా కొన్ని రాష్ట్రాల్లో బ‌లంగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల్లోనూ ఆశించిన విధంగా మాత్రం పుంజుకోలేక పోయింది. అదేవిధంగా కీల‌క‌మైన రాష్ట్రం ప‌శ్చిమ బెంగాల్‌లోనూ బీజేపీ ఆశించిన విధంగా విజ‌యం ద‌క్కించుకోలేక పోయింది. దీంతో త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న మ‌రో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌పై ఆధార‌ప‌డింది.

ఒక వేళ ఆయారాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటే ఓకే. లేక‌పోతే.. మాత్రం బీజేపీ ఇత‌ర ప్రాంతీయ పార్టీల‌పై ఆదార‌ప‌డి రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు వెళ్లాలి. ఇదిలావుంటే.. మరోవైపు.. ఎన్డీయే కూట‌మి పార్టీలు.. రాష్ట్ర‌ప‌తి పీఠంపై క‌న్నేశాయి. ఇప్ప‌టికే కేంద్ర మాజీ మంత్రి శ‌ర‌ద్ ప‌వార్‌.. రాష్ట్ర‌ప‌తిరేసులో ఉన్నారు. ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఆయ‌న చేస్తున్నారు. బీజేపీ బ‌లంగా ఉంటే.. ప్ర‌స్తుతం ఉన్న రామ్‌నాథ్‌కోవింద్‌నే కొన‌సాగించే అవ‌కాశం ఉంది.

ఒక‌వేళ బీజేపీ క‌నుక బ‌లం పుంజుకోని ప‌క్షంలో ఎన్డీయే కూట‌మి అభ్య‌ర్థిగా బ‌రిలో దిగుతార‌ని భావిస్తున్న శ‌ర‌ద్ ప‌వార్‌కు మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఏపీ, తెలంగాణ స‌హా ఒడిసా, త‌మిళ‌నాడు రాష్ట్రాలు ఎటు మ‌ద్ద‌తు తెలిపే అవ‌కాశం ఉంది? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. మ‌రీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఎటు ఉంటాయి? ఏపీ సీఎం జ‌గ‌న్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు ఎలాంటి వ్యూహాల‌తో ముందుకు సాగుతారు? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. బీజేపీతో వైరంతో ఉన్నారు. రాష్ట్రంలో పాగావేయాల‌ని.. భావిస్తున్న బీజేపీ నేత‌లు.. కేసీఆర్‌ను విమ‌ర్శించ‌డంతోపాటు కేంద్ర ప్ర‌భుత్వంత‌మ‌కు స‌రైన విధంగా స‌హ‌క‌రించ‌డం లేద‌ని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ ఒంట‌రిగా నిలిచినా.. ఈ ద‌ఫా ఆయ‌న మ‌ద్ద‌తు తెలప‌క‌పోవ‌చ్చు. దీంతో ఎన్డీయే వైపు మొగ్గు చూపే అవ‌కాశం ఉంది.

ఇక‌, ఏపీ సీఎం జ‌గ‌న్ గ‌త రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి రామ్ నాథ్ కోవింద్‌కుమ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఇప్పుడు కూడా కేంద్రంతో సంబంధాలు బాగానే ఉన్నాయి. అయితే.. నిధులు, ప్ర‌త్యేక హోదా.. త‌దిత‌ర అంశాల‌పై మాత్రం కొంత వివాదం న‌డుస్తున్నా.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక విష‌యంలో దాదాపు బీజేపీ కే మొగ్గు చూపే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ కాని ప‌క్షంలో ఎన్డీయేకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించే ఛాన్స్ ఉంటుంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.