Begin typing your search above and press return to search.
అక్కడ వైసీపీకి టీడీపీ నేతల మద్దతు?
By: Tupaki Desk | 16 May 2021 4:30 PM GMTమెజారిటీ రాజకీయం వ్యక్తిగత లాభాన్నే కోరుతుంది. అందువల్ల రాష్ట్రస్థాయిలో పార్టీల మధ్య పోరుతో సంబంధం లేకుండా.. క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల రివర్స్ రాజకీయం సాగుతూ ఉంటుంది. ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. టీడీపీ విపక్షంలో ఉంది. ఈ రెండు పార్టీల మధ్య రాష్ట్రస్థాయిలో స్నేహానికి తావులేదు. కానీ.. అనంతపురం జిల్లాలోని ఓ నియోజకవర్గంలో మాత్రం పాక్షిక స్నేహం కొనసాగుతున్నట్టు సమాచారం.
అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలిచింది. 2019 ఎన్నికల్లో సైకిల్ పార్టీ తరపున పోటీచేసిన ప్రభాకర్ చౌదరి ఓడిపోయారు. అయితే.. దీనికి గ్రూపు తగాదాలే కారణమన్న అభిప్రాయం ఉంది. ఆ పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉన్నట్టు సమాచారం.
ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి జోరుగా కార్యక్రమాలు చేపడుతున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టీడీపీ నేత ప్రభాకర్ చౌదరి కూడా ఏదో చేద్దామని ప్రయత్నిస్తున్నప్పటికీ.. జేసీ వర్గం నుంచి సపోర్టు కరువైందని అంటున్నారు.
ప్రభాకర్ చౌదరికి - జేసీ వర్గానికి ఎప్పటి నుంచో వైరం కొనసాగుతోంది. అది ఇంకా తారస్థాయికి చేరిందని అంటున్నారు. ప్రభాకర్ చౌదరికి సపోర్టుగా ఉండకుండా.. మిగిలిన నేతలను జేసీ వర్గం నిలువరిస్తోందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
దీంతో.. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జేసీ వర్గం వైసీపీ ఎమ్మెల్యేకు సహకరిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభాకర్ వర్గం అధినేత చంద్రబాబుకు ఈ విషయమై ఇదే తరహా ఫిర్యాదులు కూడా చేస్తున్నారట. ఇది చూస్తున్న టీడీపీ శ్రేణులు.. అధికారం కోల్పోయి ఏడుస్తుంటే.. మధ్యలో మీ పంచాయితీ ఏంది సామీ.. అని బావురుమంటున్నారట. మరి, గొడవ ఎందాక వెళ్తుందో చూడాలి.