Begin typing your search above and press return to search.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ వసూళ్లలో ఎక్కడున్నాయంటే?
By: Tupaki Desk | 3 March 2020 4:48 AM GMTకేంద్రానికి ఆదాయ వనరుగా ఉండే ఆదాయపన్నుకు సంబంధించిన ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. గడిచిన నాలుగేళ్లలో దేశ ఖజానాకు ఆదాయపన్ను కింద ఎంత మొత్తం జమైంది? ఏ రాష్ట్రం నుంచి ఎంత ఆదాయపన్ను వసూలైందన్న విషయాన్ని వెల్లడించాలన్న ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానాన్ని ఇచ్చారు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్.
దేశానికి ఆదాయపన్ను రూపంలో భారీ ఆదాయాన్ని అందిస్తున్న రాష్ట్రంగా మహారాష్ట్ర తొలి స్థానంలో నిలిస్తే.. రెండో రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది. ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి సిత్రంగా ఉంది. దేశంలో డెవలప్ మెంట్ విషయంలో దూసుకెళుతున్నట్లుగా చెప్పే తెలంగాణ రాష్ట్రం ఆదాయపన్ను వసూళ్లలో ఏడో స్థానానికి పరిమితమైతే.. ఏపీ దారుణంగా పద్నాలుగో స్థానంలో నిలిచింది.
ఆసక్తికరమైన విషయం ఏమంటే డెవలప్ మెంట్ అన్నదే కనిపించదని చెప్పే ఉత్తరప్రదేశ్ కంటే దాదాపు నాలుగు స్థానాల వెనుకగా ఉండటం గమనార్హం. గడిచిన ఏడాది (2019-2020) ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఆదాయపన్ను కింద జమ అయిన మొత్తాల్ని చూస్తే.. మహారాష్ట్ర రూ.2,97,957 కోట్లతో మిగిలిన రాష్ట్రాల కంటే ముందుంటే.. తర్వాతి స్థానం ఢిల్లీ రాష్ట్రం నిలిచింది. ఆ రాష్ట్రం రూ.1,08,579 కోట్ల వసూళ్లను చేపట్టింది. తర్వాత స్థానంలో కర్ణాటక.. నాలుగో స్థానం లో తమిళనాడు నిలిచాయి.
మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ సైతం ఆదాయపన్ను వసూళ్లలో వెనుకబడే ఉంది. ఆ రాష్ట్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.46వేల కోట్ల వసూళ్లను మాత్రమే చేపట్టింది. డెవలప్ మెంట్ విషయంలో వెనుకబడిన రాష్ట్రంగా చెప్పే పశ్చిమబెంగాల్ తర్వాత తెలంగాణ నిలిచింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఐటీ ఆదాయం రూ.37,806కోట్లుగా తేలింది. మరో తెలుగు రాష్ట్రమైన ఏపీ పద్నాలుగో స్థానానికి పరిమితం కావటం గమనార్హం. ఆ రాష్ట్రం నుంచి ఆదాయపన్ను పేరుతో వచ్చిన ఆదాయం రూ.13,446 కోట్లు మాత్రమే కావటం విశేషం.
గడిచిన నాలుగేళ్లలో ఆదాయ పన్ను రూపంలో కేంద్రానికి ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన ఐటీ మొత్తాల్ని చూస్తే.. తెలంగాణ వాటా 3.98 శాతం కాగా.. ఏపీ మరింత దారుణంగా 1.57శాతానికే పరిమితమైంది. తెలంగాణ లో ఒక్కో అసెస్సీ నుంచి కేంద్ర ఖజానాకు సగటున చేరిన ఆదాయం రూ.1.63 లక్షలైతే.. ఏపీలో మాత్రం సగటున రూ.64,082 మాత్రమే ఆదాయం వచ్చినట్లుగా చెబుతున్నారు.