Begin typing your search above and press return to search.
ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి టోల్ ప్లాజా వద్ద చేదు అనుభవం..ఏంజరిగిందంటే ?
By: Tupaki Desk | 25 Feb 2020 6:15 AM GMTచౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద సోమవారం ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చేదు అనుభవం ఎదురైంది. టోల్ ఫీజు చెల్లించాలంటూ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వాహనాన్ని టోల్ ప్లాజా సిబ్బంది అడ్డుకున్నారు. తాను ఎమ్మెల్సీ అని చెప్పినప్పటికీ , అయన కారు వెళ్ళడానికి అనుమతించలేదు. చివరికి నేను ఒక ఎమ్మెల్సీ అంటూ ఎమ్మెల్సీ ఐడీ కార్డు చూపించినా వదల్లేదు. కారణం ఆయనకి గన్ మేన్స్ లేకపోవడం. కానీ , ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాత్రం గన్‌మెన్ లేకపోతే ఎమ్మెల్సీ కాదనడం విడ్డూరంగా ఉంది , అసలు గన్ మెన్ ను తీసుకోవడం , తీసుకోక పోవడం తన ఇష్టమని , అడిగే హక్కు మీకు లేదని అన్నారు.
అయితే , మొదట గన్‌మెన్ లేకపోవడంతో ఎమ్మెల్సీ అని అనుకోలేదని చెప్పిన సిబ్బంది.. తర్వాత టోల్ మినహాయింపు జాబితాలో ఎమ్మెల్సీ పేరు లేదంటూ బుకాయించారు. తమకు టోల్ ఫీజు మినహాయింపు ఉందని.. ఫ్రీ ట్యాగ్ ఇస్తారని చెప్పారని.. అదే అడిగితే రేపిస్తాం.. మాపిస్తామంటూ వాయిదా వేస్తున్నారన్నారు. ఒకవేళ డబ్బులు చెల్లించే వెళ్లాలంటే చెల్లిస్తానని నర్సిరెడ్డి తెలిపారు. అలాగే ఈ టోల్ ప్లాజా సిబ్బంది తనని ప్రతి రోజు కావాలనే అవుతున్నారని , తన ముందే ప్రజాప్రతినిధులు కాని వారిని కూడా ఫ్రీ గా పంపుతున్నారన్నారు. చివరికి ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి వాహనాన్ని అనుమతించారు. కానీ , టోల్ ప్లాజా సిబ్బంది తీరుకు నిరసనగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అక్కడే ధర్నాకు దిగారు. ఏ ప్రజా ప్రతినిధిని ఆపకుండా తననే ఎందుకు ఆపుతున్నారో చెప్పేవరకు ఇక్కడి నుండి వెళ్ళేదే లేదు అంటూ అక్కడే కూర్చొని ఉన్నారు.