Begin typing your search above and press return to search.
డివిలియర్స్ తన భార్యకు ఎక్కడ ప్రపోజ్ చేశాడంటే?
By: Tupaki Desk | 17 April 2021 3:30 PM GMTఏబీ డివిలియర్స్ ఓ విధ్వంసకర బ్యాట్స్ మెన్.. దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీడీ ఐపీఎల్ లో మెరుపులు మెరిపిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్‌బై చెప్పినా .. ఐపీఎల్ లో మాత్రం ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తుంటాడు. అతడు క్రీజ్ లో ఉన్నాడంటే .. బౌలర్లకు వణుకు పుడుతుంది. ఫీల్డర్స్ కు అవే తిప్పలు.
ఇక కెప్టెన్సీ చేసేవాళ్లకయితే ఎక్కడ ఫీల్డర్స్ ను ఎక్కడ పెట్టాలో తెలియకు గందరగొళం నెలకొంటుంది. ఎందుకంటే డివిలియర్స్ మిస్టర్ 360..అతడు ఏ యాంగిల్లోనైనా షాట్స్ కొట్టగల సమర్థుడు. ఓడిపోతుంది అనుకొనే మ్యాచ్ ను ఒంటి చేత్తో గెలిపించగలడు. అందుకే అతడికి మనదేశంలోనూ ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.
ప్రస్తుతం డివిలియర్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్సీబీలో డివిలియర్స్ ఎంతో కీలక ఆటగాడు. జట్టు ఆశలన్నీ అతడి మీదే ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే మ్యాచ్‌లను మలుపుతిప్పుతుంటాడు ఏబీడీ. అయితే ఇటీవల డివిలియర్స్ భార్య డేనియల్లె ఇన్‌స్టాలో ఫ్యాన్స్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
‘డివిలియర్స్‌ది నాది లవ్ కం అరేంజ్ మ్యారేజ్. మేము తొలిసారి ఇండియాలోని తాజ్‌మహల్ లో కలుసుకున్నాం. అతడే నాకు ముందుగా ప్రపోజ్ చేశాడు. ఆగ్రాలోని ఓ హోటల్లో ఇరు కుటుంబసభ్యులు మా పెళ్లి విషయం మాట్లాడారు. సో మాది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. ఇక డివిలియర్స్ వ్యక్తిగత విషయానికి వస్తే.. అతడు క్రీజ్ లో ఉన్నప్పుడు ఎంతో విధ్వంసకరంగా ఆడతాడు. కానీ ఇంట్లో చాలా కూల్ గా ఉంటాడు. మూగజీవులంటే ఎంతో ఇష్టం. చిన్నపిల్లలన్నా ప్రాణం. నేను ఐపీఎల్ చూడటానికి ఇండియాకు వచ్చినప్పుడు డివిలియర్స్ ను తొలిసారి చూశా. పెద్దలు ఒప్పుకోవడంతో దక్షిణాఫ్రికాలో మా పెళ్లి జరిగింది’ అంటూ అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు.