Begin typing your search above and press return to search.
యాదాద్రి టూర్ తర్వాత హెలికాఫ్టర్ లో సీఎం ఎక్కడకు వెళ్లారు?
By: Tupaki Desk | 5 March 2021 3:30 PM GMTవిషయం ఏదైనా సరే.. ఫోకస్ చేస్తే అంతే. దాని అంతు చూసే వరకు నిద్రపోని తత్త్వం తెలంగాణ సీఎం కేసీఆర్ లో కనిపిస్తూ ఉంటుంది. విషయాల మీద ఆయనకున్న పట్టును చూసి నిపుణులు సైతం ఆశ్చర్యపోతుంటారు. ఇంత సమాచారం ఒక రాజకీయ నేతకు ఎలా తెలుస్తుంది? అన్న మాట పలువురి నోట తరచూ వినిపిస్తూ ఉంటుంది. తిరుమలకు ఏమాత్రం తగ్గని రీతిలో యాదాద్రిని తయారు చేయాలన్న ఆయన తపనకు తగ్గట్లే.. ఈ రోజున ఆ పుణ్యక్షేత్రం సిద్ధమవుతోంది. ఒక్కసారి యాదాద్రి ప్రజలకు అందుబాటులోకి వచ్చాక.. భక్తుల పోటు భారీగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్లే.. తాజాగా బయటకు వచ్చిన ఫోటోలు చూస్తున్న వారికి రెండు కళ్లు సరిపోని పరిస్థితి.
గురువారం యాదాద్రికి వెళ్లిన కేసీఆర్.. ఆలయ ప్రాంగణంలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. ఎక్కడికక్కడ చేయాల్సిన పనుల గురించి చెప్పటమే కాదు.. మరింత మెరుగ్గా రూపొందించేందుకు దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్లాలంటూ ఆదేశించారు. అంతేకాదు.. ఎవరెవరు ఎక్కడకు వెళ్లాలన్న విషయాల్ని స్పష్టంగా చెప్పటం గమనార్హం. తన యాదాద్రి పర్యటన తర్వాత హైదరాబాద్ కు వస్తారని అందరూ భావించారు.
అందుకు భిన్నంగా ఆయన నేరుగా ఫాంహౌస్ కు వెళ్లారు. కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. ఎక్కువగా హైదరాబాద్ లో ఉంటున్న కేసీఆర్.. యాదాద్రి నుంచి హైదరాబాద్ కే వస్తారని భావించారు. అయితే.. ఆయన మాత్రం అందరి అంచనాలకు భిన్నంగా ఫాంహౌస్ కు వెళ్లిపోయారు. ఏ మాత్రం అవకాశం లభించినా ఫాంహౌస్ కు వెళ్లేందుకు ఇష్టపడే కేసీఆర్.. తాజాగా అదే పని చేశారని చెప్పాలి.