Begin typing your search above and press return to search.
తీర్పు చెప్పిన ఆ ఐదుగురు జడ్జిలు శనివారం సాయంత్రం ఎక్కడ కు వెళ్లారు ?
By: Tupaki Desk | 10 Nov 2019 6:13 AM GMTయావత్ దేశం మొత్తం ఎంతో ఆసక్తి గా ఎదుచూసిన అయోధ్య వివాదానికి తెర దించుతూ సుప్రీం కోర్టు నిన్న ఉదయం తీర్పు వెలువరించటం తెలిసిందే. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గోగోయ్ తో పాటు ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం తీర్పు ను వెలువరించటం.. దానిపై అన్ని వర్గాల నుంచి ఆమోద ముద్ర లభిస్తున్న సంగతి తెలిసిందే.
తీవ్ర ఒత్తిడి తో పాటు.. పని భారం ఈ కేసు కారణంగా చోటు చేసుకుందన్న విషయాన్ని మర్చి పోకూడదు. నాన్ స్టాప్ గా 40 రోజుల పాటు వాదనలు వినటంతో పాటు.. తమ తీర్పును 1045 పేజీలు రాసిన సుప్రీం ధర్మాసనం పైకి కనిపించనంత ఒత్తిడి ని ఎదుర్కొందని చెప్పక తప్పదు. కోట్లాది మందిని ప్రభావితం చేసే ఈ కేసుకు సంబంధించిన తీర్పు ను నిర్ణయించే వేళలో ఉండే ఒత్తిడి అంతా ఇంతా కాదు.
దశాబ్దాల తరబడి సాగుతున్న ఈ కేసు ను ఒక కొలిక్కి తీసుకొచ్చి.. తీర్పును ఇచ్చిన సాయంత్రం వేళ.. మరోసారి ఈ ఐదుగురు న్యాయ మూర్తులు కలుసుకున్నట్లు చెబుతున్నారు. విశ్వస నీయ సమాచారం ప్రకారం ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం శనివారం సాయంత్రం వేళ విరామం కోసం కలుసుకున్నట్లు గా తెలుస్తోంది. ఢిల్లీలోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ తాజ్ మాన్ సింగ్ లో విందు కు హాజరైనట్లుగా చెబుతున్నారు. తీవ్రమైన ఒత్తిడి తర్వాత కాస్తంత విరామం కోరు కోవటం తప్పేం కాదుగా.