Begin typing your search above and press return to search.
20కు పైగా కూరల్ని వడ్డించే ఆ హోటల్ తెలంగాణలో ఎక్కడంటే?
By: Tupaki Desk | 7 Feb 2022 4:32 AM GMTఇంట్లో వండుకోవటం తగ్గింది. అది హైదరాబాద్ మహానగరమైనా.. అముదాల వలస అయినా. ప్రజల జీవనశైలిలో భారీగా వచ్చిన మార్పులు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఏదైనా హోటల్ కు భోజనం చేసేందుకు వెళితే.. నాలుగైదు కూరలు వడ్డించటం చూస్తుంటారు.కొన్ని ప్రత్యేకమైన హోటళ్లలో ఇది కాస్తా.. మరో రెండు.. మూడు కూరలు ఎక్కువగా వడ్డిస్తారు. కానీ.. అందుకు భిన్నంగా 20 రకాలకు పైనే కూరల్ని వడ్డించే ఒక హోటల్ ఉంది. అలా అని.. భోజనం ఖర్చు జేబులకు చిల్లులు పడేలా ఉండవు. ఇంతకూ ఆ హోటల్ ఎక్కడ ఉంది? అక్కడ వడ్డించే 20కు పైగా కూరలు ఏమిటన్న ఆసక్తికర అంశాల్ని చూస్తే..
ఖమ్మం జిల్లా కూసుమంచిలో నాగన్న.. శివ హోటళ్లు రోటీన్ కు పూర్తి భిన్నమైనవి. ఇక్కడ భోజనం చేసేందుకు వచ్చే వారు ఎవరైనా సరే.. జీవితంలో ఈ హోటల్ ను మర్చిపోరు. భోజనం కోసం వచ్చిన వారికి ఏకంగా 20కు పైగా కూరల్ని వడ్డించటం ఒక ఎత్తు అయితే.. అందుకోసం వసూలు చేసే మొత్తం చాలా చౌకగా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఒక భోజనానికి కేవలం రూ.వంద మాత్రమే వసూలు చేస్తారని చెబుతున్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. 20 రకాల కూరలతో పాటు.. చికెన్ కర్రీని అదనంగా వడ్డించటం వీరి ప్రత్యేకతగా చెబుతారు.
వెజ్ భోజనంలో 20 రకాల కూరలు.. నాన్ వెజ్ భోజనంలో మాత్రం బిర్యానీ.. చికెన్.. చేప కూరలను ప్రత్యేకంగా వడ్డిస్తుంటారు. అందుకే ఈ హోటల్ లో భోజనం చేసిన వారు ఎవరైనా సరే.. మరో నలుగురికి చెప్పటం కనిపిస్తుందని చెబుతారు. కొన్నేళ్లుగా భోజనంలో 20కు పైగా కూరల్ని వడ్డించే ఈ హోటల్ కూసుమంచిలోని ఖమ్మం - సూర్యాపేట స్టేట్ రోడ్డు పక్కనే ఉంది.
భోజనానికి 24 వెరైటీలను వడ్డించే ఈ హోటల్ గురించి ప్రత్యేకంగా తెలుసుకొని మరీ వెళతారని చెబుతారు. సామాన్యులు.. సంపన్నులు.. సెలబ్రిటీలు.. ఇలా తేడా లేకుండా అందరూ వచ్చి వెళ్లే ఈ హోటల్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కూరగాయల ధరలతో సంబంధం లేకుండా ఏడాది మొత్తం ప్రతి రోజూ 20కు పైగా కూరలతో భోజనం వడ్డించే ఈ హోటల్ కు ఒకసారి వెళ్లి టేస్ట్ చేయాల్సిందే.
నిత్యం వడ్డించే 20కు పైగా రకాల కూరల్ని చూస్తే..
పప్పు
దోసకాయ
దొండకాయ
గోరుచిక్కుడు
చిక్కుడు కాయ
సొరకాయ
పొట్లకాయ
వంకాయ
క్యాబేజీ
క్యాలీఫ్లవర్
బీట్‌రూట్
బంగాళదుంప
చామగడ్డ
క్యారట్
కాకరకాయ
టమాట
బీర
సొరకాయ
బెండకాయ
పాలకూర
బచ్చలికూర
చుక్క కూర
గోంగూర
మామిడికాయ పచ్చడి
నిమ్మకాయ పచ్చడి
సాంబారు
పెరుగు