Begin typing your search above and press return to search.
జాతీయ పార్టీ సరే.. ఈ ప్రశ్నలకు బదులేది కేసీఆర్?
By: Tupaki Desk | 7 Oct 2022 4:39 AM GMTరాజకీయమే ప్రధాన అంశంగా.. తన ప్రయోజనమే పరమావధిగా తాను కోరుకున్నది కోరుకున్నట్లుగా చేసేందుకు.. దేనికైనా రెఢీ అనటమే కాదు.. ఎంత మాట అనేందుకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. టీఆర్ఎస్ గా అందరికి తెలిసిన తన ప్రాంతీయ పార్టీని బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పేరుతో జాతీయ పార్టీని ఏర్పాటు చేయటం తెలిసిందే. దసరా పర్వదినాన తాను స్టార్టు చేసిన బీఆర్ఎస్ నేపథ్యంలో.. కేసీఆర్ గతంలో చేసిన కొన్ని ఘాటు వ్యాఖ్యలకు తాజాగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.
తన ఘాటు వ్యాఖ్యలతో ప్రాంతీయ ద్వేషాల్ని పెంచేసిన కేసీఆర్.. ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టేస్తున్న వేళ.. ఆయన గతంలో చెప్పిన కొన్ని మాటల్ని గుర్తు చేస్తూ.. కొన్ని సూటి ప్రశ్నల్ని సంధిస్తున్నారు. తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందేనంటూ పలువురు నిలదీస్తున్నారు. తమ డిమాండ్లను సోషల్ మీడియా.. వాట్సాప్ గ్రూపుల్లోనూ ఫార్వర్డు చేస్తున్నారు. దీంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ గులాబీ బాస్ కేసీఆర్ ను సంధిస్తున్న ప్రశ్నల్ని చూస్తే..
- కరోనా కష్టకాలంలో కరోనాతో ప్రాణాపాయంలో కొనఊపిరితో కొట్టు మిట్టాడుతున్న ఆంధ్ర పేద రోగులను ఆసుపత్రులకు రానివ్వకుండా.. ఆంధ్రా అంబులెన్సులను హైదరాబాదుకు చేరేందుకు వీల్లేని రీతిలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో అడ్డుకున్న కేసీఆర్.. ఇప్పుడెలా జాతీయవాది అవుతావు? మీరెలా జాతీయవాదులు అవుతారు?
- కరోనా వేళ ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్న కరోనా రోగులకు ఇచ్చిన రేమిడీసీవర్ ఇంజక్షన్లను నల్లబజారులో అమ్ముకుని వేలకోట్ల దోచుకున్నవాడికి రాజ్యసభ సీటు ఇచ్చి సత్కరించిన మీరు దేశానికి వెన్నుముకగా నిలిచే రైతులకు.. ఉద్యోగులకు.. మహిళలకు.. కార్మికులకు మీరే చేసే మేలేంటి?
- ఇంటగెలిచి రచ్చ గెలవాలంటారు. ఉద్యమంలో 1200 మంది బలిదానం చేశారని ప్రచారాలు చేసుకున్న మీరు వాళ్ళ ఆత్మార్పణలతో త్యాగాలతో అధికారంలోకి వచ్చారు. గత ఎనిమిదేళ్లల్లో వారిలో ఎందరికి సెంటు భూమి ఇచ్చారు? ఎందరికి కనీసం పూరి గుడిసె ఇచ్చిందెందరికి?
- తెలంగాణాలో మరణించిన రైతు కుటుంబాలను కనీస కన్నెత్తి చూడని నువ్వు.. ఎక్కడో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో మరణించిన రైతులకు ప్రభుత్వం తరపున చెక్కులు పంపిణీ చేయటమా?
- ఢిల్లీలో రైతులు ఏడాది పాటు చలి.. ఎండ.. వానలో ధర్నాచేస్తే కనీసం ఒక్కరోజైనా వాళ్ళను పరామర్శించారా? వాళ్లకు మద్దత్తుగా ఒక్క ప్రకటనైనా చేశారా?
- అప్పట్లో కేంద్రం మీద ఈగ వాలకుండా మాటలు చెప్పిన మీరు.. నేడు కేంద్రంలోని బీజేపీ దేశానికి ఏమీ చేయలదేని చెప్పేస్తున్నావ్. దేశానికి మేలు చేసేది నేనే అని చెప్పుకుంటున్నావ్. ప్రాంతీయ విద్వేషం పునాదులపై నిర్మించిన నీ ప్రాంతీయ.. కుటుంబ పార్టీని జాతీయ పార్టీగా మార్చేస్తే ప్రజలు నమ్మాలా?
- సొంత రాష్ట్రంలో కొండగట్టులో బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది కుటుంబాలను పరామర్శించలేని మీరు.. నిండుప్రాణాలు పోయి బజారున పడిన ఆ కుటుంబాలను మీరు ఆదుకోలేదు. కానీ.. ఎక్కడో ఉత్తరభారతంలో చనిపోయిన రైతు కుటుంబాలను ప్రత్యేక విమానంలో వెళ్లి పరామర్శకు వెళ్లటమా?
- దగ్గర దగ్గర తొమ్మిదేళ్లు అవుతోంది అధికారంలోకి వచ్చి. ఈ తొమ్మిదేళ్ల కాలంలో తొమ్మిది రోజులు కూడా రాష్ట్ర సచివాలయానికి వెళ్లింది లేదు. కానీ.. ఎక్కడో ఉన్న మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఝార్ఖండ్ ఉత్తరాఖండ్ బీహార్ బెంగాల్ తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్దకు మాత్రం వెళ్లటమా?
- ఉమ్మడి రాష్ట్రంలో రవాణాశాఖ మంత్రిగా కేంద్ర కార్మికమంత్రిగా ఉన్నప్పుడు నువ్వెన్నిసార్లు నీ కార్యాలయానికి వెళ్ళావు? గత ఎనిమిదేళ్లుగా ఎన్నిసార్లు సచివాలయంకి వెళ్ళావు? సచివాలయంలో ఎన్నిసార్లు మంత్రివర్గసమావేశాలు నిర్వహించారు? అటువంటిది దేశానికి ప్రధానమంత్రివి అయి దేశాన్ని ఉద్ధరిస్తారా? మీరు దేశానికి నేతవా?నిన్ను దేశప్రజలు నమ్మాలా? నమ్ముతారంటారా?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.