Begin typing your search above and press return to search.

ఎంపీ సీట్ల కేటాయింపు!... స‌మ‌తూకం ఎక్క‌డ‌?

By:  Tupaki Desk   |   19 March 2019 11:08 AM GMT
ఎంపీ సీట్ల కేటాయింపు!... స‌మ‌తూకం ఎక్క‌డ‌?
X
ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయంటే... దాదాపుగా అన్ని రాజ‌కీయ పార్టీలు కూడా ఆయా వ‌ర్గాల ఓటు బ్యాంకును చేజిక్కించుకునేందుకు అందుబాటులోని అన్ని మార్గాల‌ను ఆశ్ర‌యిస్తాయి. ఇందులో పెద్ద‌గా ఆశ్చ‌ర్యమేమీ లేకున్నా... ఆయా వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేందుకు చేసే య‌త్నాల‌కు స‌రిప‌డిన‌ట్టుగా... ఆ యా వ‌ర్గాల‌కు చెందిన నేత‌ల‌కు సీట్లు ఇవ్వ‌డంలో మాత్రం ఆస‌క్తి చూపించ‌వు. ఇది ఇప్పుడే క‌నిపిస్తున్న, క‌నిపిస్తున్న మాటేమీ కాదు. ఏళ్ల త‌ర‌బ‌డి ఇదే ఈ త‌ర‌హాలో రాజ‌కీయ పార్టీలు అనుస‌రిస్తున్న వ్యూహాల‌ను మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా అంతే. అయితే చెప్పిన మాట‌ను నిల‌బెబెట్టుకునే దిశ‌గా కొన్ని పార్టీలు సాగుతుంటాయి. ఆ పార్టీల జాబితాలో ఇప్పుడు ఏపీలోని విప‌క్షం వైసీపీ కూడా చేరిపోయింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఎందుకంటే... గ‌డ‌చిన ఎన్నిక‌లు ముగిసిన నాటి నుంచి ప్ర‌జ‌ల్లోనే ఉంటూ వ‌స్తున్న ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... ఆయా సీట్ల‌ను ఈ ద‌ఫా ఆయా సామాజిక వ‌ర్గాల‌కు కేటాయిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టుగానే చెప్పిన మాట ప్ర‌కారం.... బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు జ‌గ‌న్ పెద్ద పీటే వేశారు. త‌న సొంత సామాజిక వ‌ర్గానికి ఓ మోస్త‌రు సీట్ల‌ను కేటాయించిన జ‌గ‌న్‌... బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, కాపులు త‌దిత‌ర వ‌ర్గాల‌తో పాటుగా కమ్మ సామాజిక వ‌ర్గానికి కూడా సీట్ల‌ను కేటాయించిన త‌న‌దైన శైలి స‌మ‌తూకం చూపార‌ని చెప్పాలి. ఎంపీ సీట్ల కేటాయింపులో ఈ దిశ‌గా జ‌గ‌న్ వైఖ‌రి చాలా సుస్ప‌ష్టంగా క‌నిపించింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. రాష్ట్రంలో మొత్తం 25 ఎంపీ సీట్లుండ‌గా.. వాటిలో ఆరు సీట్ల‌ను రెడ్డి సామాజిక వ‌ర్గానికి కేటాయించిన జ‌గ‌న్‌... క‌మ్మ సామాజిక వ‌ర్గానికి 3 సీట్లు కేటాయించారు. ఇక బీసీల‌కు అత్య‌ధికంగా ఆరు సీట్ల‌ను కేటాయించిన జ‌గ‌న్‌... ఎస్సీ, ఎస్టీల‌కు 5 సీట్లు కేటాయించారు. ఇక కాపుల‌కు 3 సీట్ల‌ను కేటాయించిన జ‌గ‌న్‌... వెల‌మ‌ల‌కు ఓ సీటు, క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి ఓ సీటు కేటాయించారు.

ఇక టీడీపీ విష‌యానికి వ‌స్తే... క‌మ్మ సామాజిక వ‌ర్గానికి ఆరు సీట్లు కేటాయించిన ఆ పార్టీ... రెడ్ల‌కు నాలుగు సీట్లు కేటాయించింది. బీసీల పార్టీగా చెప్పుకునే టీడీపీ... ఆ వ‌ర్గానికి 5 సీట్ల‌ను కేటాయించింది. ఇక కాపుల‌కు న్యాయం చేసిన పార్టీ కూడా త‌మ‌దేన‌ని చెప్పుకున్న చంద్ర‌బాబు... కాపుల‌కు రెండండే రెండు సీట్లు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీల‌కు 5 సీట్లు, క్ష‌త్రియుల‌కు రెండు సీట్లు, వైశ్యుల‌కు ఓ సీటును కేటాయించింది. మొత్తంగా చూస్తే... బీసీలు, కాపుల ఓట్ల‌న్నీ త‌న‌వేన‌ని చెప్పుకునే టీడీపీ కంటే కూడా ఆ రెండు వ‌ర్గాల‌కు వైసీపీనే అధిక ప్రాధాన్యం ఇచ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక వైశ్యుల‌కు వైసీపీ సీటు కేటాయించ‌లేక‌పోయింది గానీ... ఒంగోలు ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతారంటూ టీడీపీ చెప్పుకొచ్చిన మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డి వైసీపీలోకి చేరిపోవ‌డంతో ఆ పార్టీ వైశ్యుల‌కు సీటిచ్చింది గానీ... మాగుంట పార్టీలోనే ఉంటే... వైశ్యుల‌కు టీడీపీ సీటిచ్చే ప‌రిస్థితే లేద‌న్న మాట కూడా వినిపిస్తోంది. మొత్తంగా సామాజిక స‌మ తూకంలో టీడీపీ కంటే వైసీపీనే బెట‌రైన మార్గంలో ప‌య‌నించింద‌న్న మాట ఇప్పుడు బ‌లంగా వినిపిస్తోంది.

టీడీపీ, వైసీపీ ఎంపీ సీట్ల కేట‌టాయింపు ఇలా...

సామాజిక వ‌ర్గం టీడీపీ వైసీపీ
రెడ్లు.............. 4............ 6
కమ్మ..........,,... 6............ 3
కాపు.........,,,..... 2............ 3
వెలమ............. 0............ 1
బిసి................. 5............ 6
ఎస్..ఎస్టీ.......... 5............ 5
క్షత్రియ........... 2............ 1
వైశ్య................. 1............ 0