Begin typing your search above and press return to search.
దేశంలో న్యాయమెక్కడ...మాల్యా ఆవేదన
By: Tupaki Desk | 2 Feb 2019 6:25 AM GMTలిక్కర్ కింగ్ - విలాసపురుషుడు విజయ్ మాల్య బ్యాంకులకు రూ.9,000 కోట్లకు పైగా బకాయిలను ఎగ్గొట్టి దాదాపు మూడేండ్ల క్రితం మాల్యా దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాల్యాను స్వదేశానికి రప్పించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లండన్ కోర్టులో ఎడతెగని పోరాటమే చేయగా..అది పూర్తి ఫలితం ఇవ్వలేదు. ఈ విషయమై బ్రిటన్ వెస్ట్ మినిస్టర్ కోర్టులో వాదనల సందర్భంగా మాల్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనపై పరారీ ఆర్థిక నేరగాడి ముద్ర వేశారని - బ్యాంకుల మోసాల బ్రాండ్ అంబాసిడర్ గా నిలబెట్టారని ఒకింత ఆవేదన వ్యక్తం చేసిన మాల్యా భారతీయ బ్యాంకులకు బకాయిపడిన మొత్తంలో అసలును చెల్లిస్తానని చెబుతూనే ఉన్నానని - అయినప్పటికీ ఎవరూ నమ్మడం లేదన్నారు. భారత న్యాయవ్యవస్థను ఎవరూ ఏమార్చలేరని వ్యాఖ్యానించిన ఆయన తాజాగా దేశంలో న్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు.!
విజయ్ మాల్యాను పారిపోయిన ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించిన బ్యాంకుల కన్సార్టియం తరఫున అప్పు రికవరీ ట్రిబ్యునల్ కు చెందిన అధికారులు మాల్యా ఆస్తులను జప్తు చేశారు. ఈ నేపథ్యంలో కింగ్ ఫిషర్ అధినేత ట్విట్టర్ ద్వారా తన ఆవేదన - అసహనం వెల్లగక్కాడు. తన ఆస్తులను జప్తు చేయడం అన్యాయని వాపోయాడు. తనకు సంబంధించిన దాదాపు 13వేల కోట్ల ఆస్తులను దర్యాప్తు సంస్థలు జప్తు చేశాయని.. తాను చెల్లించాల్సిన రుణాలు 9వేల కోట్లు మాత్రమేనని పేర్కొన్నాడు. `` ఇంకా ఇది ఎంత దూరం వెళ్తుంది? ఇది న్యాయమేనా? భారత్ లోని అప్పులు సెటిల్ చేసేందుకు బ్యాంకులు ఇంగ్లండ్ లోని నా డబ్బు కావాలనుకుంటున్నాయి`` అని మండిపడుతూ పలు ట్వీట్లలో కీలక కామెంట్లు చేశారు.
కాగా, కొద్దికాలం క్రితం మాల్యా న్యాయవాది ఆసక్తికర ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మాల్యా రహస్యంగా దేశం వీడిపోయారన్నదానిలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. ముందుగా ఖరారైన ఓ అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనేందుకే వెళ్లారని అన్నారు. 2016 - మార్చి 2న విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోలేదని, స్విట్జర్లాండ్ లోని జెనీవాలో జరుగుతున్న వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లారని హాజరయ్యేందుకు వెళ్లారని ఆయన తరఫు న్యాయవాది ఈడీ కోర్టుకు తెలిపారు. అయితే 300 బ్యాగులతో - భారీ కార్గోతో ఓ సమావేశానికి ఎవరైనా వెళ్తారా అని ఈడీ న్యాయవాది ప్రశ్నించారు. అయితే, ఈడీ ఆయనతో విబేధించి పరారైన ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించి ఆస్తుల జప్తు చేస్తోంది. దీనిపైనే తాజాగా మాల్యా అసహనం వ్యక్తం చేశారు.