Begin typing your search above and press return to search.

ఎంపీ కవిత సైలెన్స్ వెనుక కారణమేంటి.?

By:  Tupaki Desk   |   29 Oct 2018 2:30 PM GMT
ఎంపీ కవిత సైలెన్స్ వెనుక కారణమేంటి.?
X
ఇది ఎన్నికల సమయం.. పార్టీల నేతలందరూ జనంలో ఉంటూ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. కానీ మీరు గమనించారా.? కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సైలెంట్ అయిపోయారు. ఆమె మౌనం రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. కొద్దిరోజులుగా కవిత నుంచి ఒక్క ప్రెస్ మీట్ కానీ.. పత్రికా ప్రకటన కానీ రాలేదు. ఆమె కార్యాలయం నుంచి ఎలాంటి అలికిడి లేదు. ఆమె ఎన్నికల బహిరంగ సభల్లో కూడా పాల్గొనడం లేదు. ర్యాలీలు, ప్రచారంలో కూడా కనిపించడం లేదు. జగిత్యాలలో అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే టీ జీవన్ రెడ్డిపై పరుష విమర్శలు చేశాక ఆమె పొలిటికల్ స్క్రీన్ నుంచి మాయం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మంత్రి కేటీఆర్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ప్రతీ విషయంపై స్పందిస్తూ.. వివిధ సభల్లో ప్రసంగిస్తూ చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. ఇక మరో సీనియర్ మంత్రి హరీష్ రావు సైతం మెదక్ జిల్లాలో సుడిగాలి పర్యటన జరుపుతూ క్యాడర్ ను ఉత్సాహపరుస్తున్నాడు. గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ గెలుపు బాధ్యతను భుజాన వేసుకొని అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. కానీ నిజామాబాద్ ఎంపీ కవిత.. ఆమె పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ లలో.. మిగతా ప్రాంతాల్లో సైతం ఎక్కడ కనిపించకపోవడం గమనార్హం.

తాజా సమాచారం ప్రకారం.. నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ బలం ఆశించినంతగా లేదని రిపోర్టులు వచ్చాయంటున్నారు.. కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ గాలి వీస్తోందట..బోధన్ లో సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి ఎదురుగాలి అన్న సంకేతాలొస్తున్నాయట.. ఇక బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు ప్రతికూలంగా ఉన్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలోనే ఎంపీ కవిత తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. పలువురు అసంతృప్తులను, అసమ్మతులను చేరదీస్తూ.. పార్టీ బలం కోసం కలిసి పనిచేసేలా ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఇక పలువురు కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులతోను ఆమె చర్చలు జరుపుతూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం పనిచేసేలా పార్టీలోకి రప్పించేందుకు వ్యూహాత్మకంగా కదులుతున్నట్టు సమాచారం. అందుకే బయటకు రాకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నట్టు తెలిసింది.