Begin typing your search above and press return to search.
ప్రజా గాయకుడు గద్దర్ ఎక్కడ .. ?
By: Tupaki Desk | 23 Nov 2019 11:41 AM GMTఅయన పాట పాడితే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. ప్రతి ఉద్యమంలో అయన తన పాటలతో అందరిలో ఉద్యమ స్ఫూర్తిని నింపేవారు.ఏ ఉద్యమం జరిగినా ఆయన ముందు వరుసలో ఉండేవారు. ఆయన పాటలు ఎన్నో ఉద్యమాలకు బాట చూపింది. మరెన్నో పోరాటాల కు ఊపిరి పోసింది. కానీ , ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు దాదాపు 50 రోజులుగా సమ్మె బాటలో నడుస్తున్నారు..కానీ , ఇంతవరకు గద్దర్ ఆర్టీసీ వారికీ సంఘీభావం కూడా ప్రకటించ లేదు. ఆర్టీసీ సమ్మె కి అయన పాట కలిసింటే ..వారి ఉద్యమానికి మరింత సాయంగా నిలిచేది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏ ఉద్యమం జరిగినా గద్దర్ పాట పడేవారు కానీ , ఆర్టీసీ ఉద్యమం లో మాత్రం ఆయన పాట ఎక్కడా వినిపించడం లేదు. దీనితో అసలు గద్దర్ ఆర్టీసీ సమ్మె పై స్పదించలేదు , అయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. ఆరు నెలలుగా గద్దర్ కనిపించడం లేదు. ఆయన ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అని పలువురు నేతలు అయన గురించి ఆరా తీస్తున్నారు. తెలంగాణ ఉద్యమం నుండి 2018 మహా కూటమి వరకు చాలా చురుగ్గా ఉన్న ప్రజా గొంతు ఇప్పుడు ఎందుకు మూగబోయింది అని చర్చించుకుంటున్నారు.
ఆర్టీసీ సమ్మెకు గద్దర్ ఎందుకు దూరంగా వున్నారో కూడా ఎవరికీ అర్ధం కావటం లేదు. గద్దర్ మౌనానికి కారణం ఏమిటీ..? ఈమద్య గద్దర్ ఎందుకు రాజకీయాలకు దూరంగా వుంటున్నారు…అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది .2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోనియాగాంధీ మొదలు చంద్రబాబు వరకు హేమాహేమీలతో బిజీబిజీ గా గడిపిన గద్దర్ , ఎన్నికల ఫలితాల తరువాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం గద్దర్ సొంతపనుల్లో నిమగ్నమయ్యారని ప్రచారం జరుగుతోంది. కర్ణాటకలోనే ఎక్కువగా ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికి ఆయన లోకల్ గా ఎక్కువ గా ఉండడం లేదని అంటున్నారు. కానీ ఆయన లేని లోటు మాత్రం ఆర్టీసీ సమ్మెలో కొట్టొచ్చినట్టు చాలా స్పష్టం గా కనిపించింది అని గద్దర్ అభిమానులు చెప్తున్నారు.