Begin typing your search above and press return to search.

విరాట్ కోహ్లీ ఎక్కడ? ఐసీసీ కొత్త వీడియోపై నెటిజన్ల ఫైర్

By:  Tupaki Desk   |   20 Oct 2022 1:30 AM GMT
విరాట్ కోహ్లీ ఎక్కడ? ఐసీసీ కొత్త వీడియోపై నెటిజన్ల ఫైర్
X
ఇండియన్ క్రికెట్ లోనే అత్యంత యాక్టివ్ గా ఉండే క్రికెటర్ విరాట్ కోహ్లీ. అటు మైదానంలో అయినా ఇటు బయట కార్యక్రమాల్లో అయినా ఉత్సాహంగా పాల్గొంటాడు కోహ్లీ. ప్రచార యాడ్స్ లోనూ కోహ్లీ ఉత్సాహం చూపిస్తుంటాడు. ఐసీసీ ఈవెంట్ల ప్రచారాల్లో ధోని తర్వాత కోహ్లీనే కనిపిస్తుంటాడు. అలాంటి విరాట్ కోహ్లీ తాజాగా మిస్ అయ్యాడు. ‘భారత క్రికెట్ పోస్టర్ బాయ్’గా గుర్తింపు పొందిన విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్ టీ20 టోర్నమెంట్ యాడ్ లో కనిపించలేదు. కోహ్లీ కొన్నేళ్లుగా బ్యాటర్‌గా , కెప్టెన్‌గా భారత క్రికెట్‌కు కొత్త కోణాలను అందించాడు.

అతను ప్రస్తుతం భారత కెప్టెన్ కాకపోవచ్చు, కానీ అతను ఇప్పటికీ భారత జట్టు బలమైన మూల స్తంభాలలో ఒకడు. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారత జట్టులోని కొంతమంది ప్రముఖులతో కూడిన వీడియోను షేర్ చేసింది. అందులో విరాట్ కోహ్లీ ఎక్కడా కనిపించలేదు.

ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వీడియోలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ , యుజ్వేంద్ర చాహల్ వంటి వారు తమ ఛాతీని కొట్టుకుంటూ బీసీసీఐ లోగోపై టచ్ చేస్తూ కనిపించారు. అయితే, ఈ వీడియోలో టీమిండియా క్రికెటర్లు అందరూ కనిపించినా.. కోహ్లీ మాత్రం ఈ తారల మధ్య లేకపోవడం చూసి చాలా మంది అభిమానులు తమ నిరాశను వ్యక్తం చేశారు.

వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన టీమ్ ఇండియా రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లలో కూడా కోహ్లీ పాల్గొనలేదు కానీ ఇటీవల ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ గేమ్‌లో ప్లేయింగ్ XIలో భాగమయ్యాడు. అయితే, అనుభవజ్ఞుడైన కోహ్లీ అతని సంపూర్ణ అత్యుత్తమ ప్రదర్శనకు కనబరచలేదు. అతను మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో త్వరగానే అవుట్ అయ్యాడు. 13 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేశాడు.

33 ఏళ్ల కోహ్లీ మ్యాచ్ చివరి ఓవర్‌లో ఒక అద్భుతమైన రనౌట్ చేసి భారత్‌కు మ్యాచ్ ను అనుకూలంగా మార్చాడు. ఈ మ్యాచ్‌లో చివరి 4 బంతుల్లో మొత్తం 4 వికెట్లు కూల్చి ఆసీస్ మిడిల్ ఆర్డర్‌ను టీమిండియా మట్టికరిపించి ఓడించింది. . మహ్మద్ షమీ చివరి ఓవర్ వేసి సత్తా చాటాడు. అందులో 3 వికెట్లు పడగొట్టగా, ఒకటి రనౌట్ ఉంది. ఫీల్డ్‌లో కోహ్లీ చేసిన విన్యాసాలు, షమీ 3 వికెట్లతో సత్తా చాటడంతో ఆస్ట్రేలియాపై ఇండియా గెలిచింది.

టీమ్ ఇండియా తన టీ20 ప్రపంచ కప్ 2022 పోరును అక్టోబర్ 23న పాకిస్తాన్‌తో ప్రారంభించనుంది. రోహిత్ శర్మ జట్టుకు కేవలం ఒక వార్మప్ మ్యాచ్ మాత్రమే ఉంది. అయితే బుధవారం న్యూజిలాండ్‌తో మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. దీంతో ఇక పాకిస్తాన్ తోనే డైరెక్ట్ ఫైట్ కు ఇండియా రెడీ అయిపోయింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.