Begin typing your search above and press return to search.

ఇక్కడి నుంచి రఘువీరా పోటీ!

By:  Tupaki Desk   |   8 Feb 2019 5:35 AM GMT
ఇక్కడి నుంచి రఘువీరా పోటీ!
X
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. కానీ ఆయన ఎక్కడి నుంచి పోటీచేస్తారనే ఆసక్తి మాత్రం అందరిలోనూ నెలకొంది. కాంగ్రెస్ హయాంలో ఆయన కళ్యాణ దుర్గం నుంచి పోటీచేసి వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. కానీ గడిచిన ఎన్నికల్లో మాత్రం నియోజకవర్గం మారి ఘోరంగా ఓడిపోయారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసిన సమయంలో ఆయన పెనుకొండ నుంచి పోటీచేశారు. అక్కడ టీడీపీ నేత పరిటాల సునీత సహకారంతో గెలుస్తానని ఆశించి బరిలోకి దిగారు. కానీ సునీత సహకరించేందుకు ముందుకు వచ్చి వెనక్కి తగ్గారు. పెనుకొండలో టీడీపీ తరుఫున బరిలోకి దిగిన పార్థసారథి.. సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడులో తన కులపోళ్లను ఆమెకు వ్యతిరేకంగా పనిచేయాలని ఆదేశించారట.. దీంతో తన సీటుకే ఎసరు వస్తుందని రాజీకొచ్చి సునీత వెనక్కి తగ్గినట్టు వార్తలొచ్చాయి. అప్పుడు పెనుకొండలో టీడీపీ అభ్యర్థియే గెలిచారు. రఘువారీ భారీగా ఓట్లు చీల్చి టీడీపీ అభ్యర్థి గెలుపులో కీలకంగా మారారు.

కాగా ప్రస్తుతం మళ్లీ తన పాత నియోజకవర్గం కళ్యాణ దుర్గానికే మారాలని రఘువీరా స్కెచ్ వేశారు. కళ్యాణ్ దుర్గం నుంచి వైసీపీ తరుఫున ఉషశ్రీ చరణ్ పోటీచేస్తుండగా.. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంత చౌదరి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. వీరిద్దరికంటే సీనియర్ అయిన తనకు గెలుపు అవకాశాలుంటాయని రఘువీరా ఈసారి కళ్యాణ దుర్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీ ఒకవేళ అభ్యర్థిని మార్చినా తనకే కలిసివస్తుందని రఘువీరా ఆశిస్తున్నారు.