Begin typing your search above and press return to search.
వందల కోట్లు పోయి.. లక్షల కోట్లా? ఈ పథకాలకు డబ్బులు లెక్కడివి?
By: Tupaki Desk | 25 July 2021 8:46 AM GMTప్రభుత్వ పథకాలు లక్షలు పోయి.. కోట్లకు చేరుకొని చాలాకాలమే అయ్యింది. ఇప్పుడు కోట్ల స్థానే వందల కోట్లు.. వేల కోట్లకు చేరుకుంటున్నాయి. దీంతో బడ్జెట్లు షేక్ అవుతుంటే.. జనాల నెత్తిన పన్నుబాదుడు ఒక రేంజ్లో సాగుతోంది. రోజూ కాకున్నా రెండు మూడు రోజులకు పెట్రోల్ బంకులకు వెళ్లినోళ్లంతా పెరుగుతున్న ధరలతో ఉక్కిరిబిక్కిరి కావటమే కాదు.. పెరిగిపోతున్న భారాన్ని ఏ రీతిలో తగ్గించుకోవాలో అర్థం కాక సతమతవుతున్న పరిస్థితి. ఒక వైపు ఇలాంటి పరిస్థితి ఉంటే.. మరోవైపు భారీ పథకాలతో నోరు ఊరిపోయేలా.. కళ్ల ముందు భారీ బడ్జెట్ మూవీ కనిపిస్తున్న పరిస్థితి.
కాస్త ఆగితే చాలు.. కష్టాలన్ని చెల్లుచీటినే.. గతంలో పథకాల పేరుతో నిత్యవసర వస్తువులు.. వస్త్రాలు.. వస్తువుల మీద సబ్సిడీలు ఇచ్చే వారు. అప్పుడప్పుడు ఇళ్లను కూడా అందించేవారు. ఇప్పుడు ఆ స్థానే.. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి నగదును బదిలీ చేసే కొత్త అలవాటు వచ్చి చేరింది. ఇప్పుడు ఆ తీరుకు దేశంలో మరెవరూ ఆలోచించని రీతిలో ఒక్కో లబ్థిదారు బ్యాంకు ఖాతాలోకి నేరుగా రూ.10లక్షల మొత్తాన్ని బదిలీ చేస్తామని.. దాంతో వారి బతుకులు మారిపోతాయన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాకుంటే.. నియోజకవర్గంలో వంద మంది చొప్పున.. దశల వారీగా అందరికి అందేలా చేస్తానని చెబుతున్నారు కేసీఆర్.
తాజాగా ఈ పథకం కోసం రూ.80 వేల నుంచి రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు అయినా పెడతామంటూ సంచలన ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. సమాజంలో వెనుకబడి.. అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం ఖర్చు చేయటం తప్పేం కాదు. కానీ.. దానికో లెక్క ఉండాలి కదా? దళితులకు అమలు చేస్తున్న ఈ పథకం సమాజంలో మైనార్టీ.. వెనుకబడిన.. అత్యంత వెనుకబడిన వారి సంగతేంటి? అన్నది మరో ప్రశ్న. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పేరుకు అగ్ర వర్ణమనే కానీ.. ఆర్థికంగా అత్యంత వెనుకబడిన వారి సంగతేమిటి? అన్నది మరో ప్రశ్న. కులాలు.. మతాలకు అతీతంగా సమాజంలో డబ్బులున్నోళ్లు.. డబ్బులు లేనోళ్లు అన్నదే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది కదా? స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఏదైతే ఒక్కోవర్గానికి ఒక్కో పథకం అన్నట్లు అమలు చేసే కాలం చెల్లిన విధానాలు మరెంత కాలం కొనసాగిస్తారు? అన్నది ప్రశ్న.
సంక్షేమ పథకాల కోసం ఏటా చేస్తున్న ఖర్చు ఎక్కడికి వెళుతోంది? ఎవరి జేబుల్లోకి పోతోంది? అన్నది ప్రశ్న. ఇంత ఖర్చు చేసిన తర్వాత కూడా సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయే తప్పించి.. తగ్గట్లేదు. అంతే.. ఇప్పటివరకు అనుసరించిన విధానాలు ఫెయిల్ అయినట్లే కదా? మరి.. విఫలమైన విధానాల్ని నేటికి అమలు చేయటం.. భవిష్యత్తులోనూ కొనసాగించటం దేనికి నిదర్శనం? పాలకులు ప్రకటించిన పథకాల వివరాలు విన్నంతనే ఒళ్లు మైమరిచిపోయేలా చప్పట్లు కొట్టటమేనా? ఇప్పటికి ఆ రొడ్డు గొట్టుడు సంప్రదాయాన్ని పాటించాల్సిందేనా?
పార్టీలు.. అధినేతలు ఎవరైనా కావొచ్చు. కానీ.. అందరూ అనుసరిస్తున్న విధానాలు మాత్రం ఒక్కటే. సమాజం ఐక్యమత్యంతో ఉండాలని చెబుతూనే.. పథకాల పప్పుబెల్లాల పేరుతో వర్గాలుగా విడదీస్తున్న రాజకీయాన్ని ఏమని ప్రశ్నించాలి? ఎలా నిలదీయాలి? అంతకంతకూ పెరిగిపోతున్న పథకాల ఖర్చు అంతిమంగా సామాన్యుడి జేబు మీదనే భారం మోపుతుందన్న వాస్తవాన్ని గుర్తించకపోతే.. మనకు మించిన తెలివి తక్కువ వారు ఇంకెవరు ఉండరు? అయినప్పటికీ పథకాల్ని ప్రకటించిన వారిని దేవుళ్లుగా నెత్తిన పెట్టుకుంటారనే ధోరణిని మీరు సమర్థించినా.. మీ తర్వాతి తరం.. లేదంటే ఆ తర్వాతి తరమైనా సరే.. తమ తాతలు చేసిన తప్పుల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టించుకోవటం ఖాయం.