Begin typing your search above and press return to search.
పెళ్లికి నమ్మించి సెక్స్ చేసి వదిలేస్తే తప్పే
By: Tupaki Desk | 15 April 2019 5:38 AM GMTఆసక్తికర తీర్పును వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. పెళ్లికి ముందు శృంగారం మంచిదా? చెడ్డదా? అన్నది పక్కన పెడితే.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సెక్స్ తర్వాత నో అంటే.. అది నేరం కిందకే వస్తుందని తేల్చింది. దీనికి సంబంధించిన ఒక కేసులో నిందితుడికి ఏడేళ్లు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు.. జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం తాజాగా ఈ తీర్పును వెలువరించింది.
ఛత్తీస్ గఢ్ కు చెందిన ఒక యువతి.. అనురాగ్ సోని అనే వ్యక్తితో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతడు పెళ్లికి ఓకే అనటంతో వారిద్దరూ కలిసి 2009లో సహజీవనం చేశారు. ఈ క్రమంలో అతడికి లైంగికంగా దగ్గరైంది. ఆ తర్వాత అతడు పెళ్లికి నో చెప్పేశాడు.
దీంతో.. తనకు జరిగిన మోసాన్ని గుర్తించిన ఆమె కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన ట్రయల్ కోర్టు అతడికి శిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చారు.అయితే.. అప్పీలు చేసుకున్న నిందితుడు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా అతనికి ఎదురుదెబ్బే తగిలింది. ఈ నేపథ్యంలో అనురాగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ తీర్పును ఇచ్చింది. నిందితుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు కాబట్టే ఆమె సమ్మతిని సాధారణ సమ్మితిగా పరిగణించలేమని పేర్కొంది. పెళ్లికి ఒప్పుకోవటంతో అతడికి లైంగికంగా దగ్గర కావటానికి ఆమె ఒప్పుకుందని.. నమ్మకాన్ని వమ్ము చేసిన నేపథ్యంలో అది కాస్తా రేప్ కిందకే వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. హత్య కంటే రేప్ ఘోరమైనదని పేర్కొంది.
హత్య శరీరానికి సంబంధించిందైతే.. రేప్ శరీరంతో పాటు.. మనసుకు సంబంధించింది కూడానని వెల్లడించింది. ఆ బాధ జీవితాంతం వెంటాడుతుందని పేర్కొంది. ఈ ఉదంతంలో నిందితుడికి ఏడేళ్లు జైలుశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది.