Begin typing your search above and press return to search.
గంటా... సైడ్ చేయాలని డిసైడ్... ?
By: Tupaki Desk | 9 Oct 2021 11:30 AM GMTవిశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును మంచి వ్యూహకర్తగా చెప్పుకుంటారు. ఆయన ఏపీ రాజకీయాలను ఔపాసన పట్టేశారు అని అంటారు. ఆయనకు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ముందే అంచనా ఉంటుంది, దానికి తగినట్లుగానే ఆయన అడుగులు వేస్తారు. చివరికి గెలిచే పార్టీలొనే ఉంటారు. ఇలా రెండు దశాబ్దాల ఆయన రాజకీయ జీవితం సక్సెస్ ఫుల్ గా సాగిపోయింది. ఇవన్నీ ఇలా ఉంటే 2019 ఎన్నికల్లో కూడా గంటా వైసీపీ ఏపీలో అధికారంలోకి వస్తుందని ఊహించారని చెబుతారు. అయితే ఆయన ఆ పార్టీలోకి వెళ్ళకముందే అవంతి శ్రీనివాసరావు వచ్చి చేరడంతో గంటా టీడీపీలోనే ఉండిపోయారు అంటారు.
ఇక గంటా విశాఖ నార్త్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి జగన్ వేవ్ లో గెలిచినా కూడా గత రెండున్నరేళ్ళుగా టీడీపీకి దూరంగానే ఉంటున్నారని చెబుతారు. గంటా మధన పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. తనకు చంద్రబాబు సరైన గుర్తింపు ఇవ్వలేదన్నది ఆయన బాధగా ఉందిట. పబ్లిక్ అఫైర్స్ కమిటీ చైర్మన్ పదవి ఇస్తారని అనుకుంటే దక్కలేదు. శాసనసభలో ఉప నాయకుడి హోదా కూడా చిక్కలేదు. ఇక పార్టీలో అత్యున్నత వేదిక పొలిట్ బ్యూరోలో మెంబర్ కూడా నియమించలేదు. దాంతో గంటా ఫుల్ సైలెంట్ అయ్యారని చెబుతారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి గంటా టీడీపీలో కొనసాగుతారా అన్న దాని మీద కూడా ఎవరి డౌట్లు వారికి ఉన్నాయి.
అయితే ఇదే రకమైన డౌట్ టీడీపీ అధినాయకుడు చంద్రబాబుకు కూడా ఉందా అన్న చర్చ ఇక్కడ సాగుతోంది. తాజాగా చంద్రబాబు ఏపీలోని ఆరు కీలకమైన నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించారు. ఇందులో భీమవరం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుని పక్కన పెట్టేశారు. ఆ సీటుకి మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని ఇంచార్జి చేశారు. రామాంజనేయులు గంటాకు వియ్యంకుడు అవుతారు. ఆయన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు, 2014 లో టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇచ్చినా ఓడిపోయారు. అయితే ఆయన భీమవరంలో గత కొంతకాలంగా యాక్టివ్ గా లేరనే తప్పించారని అంటున్నారు. మరో వైపు చూస్తే ఆయన గంటాకు వియ్యకుండు కావడం వల్లనే ఆయనను నమ్మలేకనే సైడ్ చేశారు అన్న మాట ఉంది.
ఇదే విధంగా గంటా మరో వియ్యంకుడు మాజీ మంత్రి నారాయణకు కూడా టీడీపీలో ఇపుడు సరైన ప్రాధాన్యత లేదు. దీన్ని బట్టి చూస్తూంటే గంటాకు చెక్ చెప్పడానికే టీడీపీ డిసైడ్ అయిందా అన్న మాట కూడా ఉంది. విశాఖ జిల్లా రాజకీయాల వరకూ చూస్తే గంటాకు మరో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి పడదు అన్నది తెలిసిందే. ఇక ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్న అచ్చెన్నాయుడుతో కూడా విభేదాలు ఉన్నాయని అంటారు. గంటా శ్రీకాకుళం జిల్లాలో కిమిడి కళా వెంకటరావుకు మద్దతు ఇచ్చేవారు. ఇలా కనుక చూసుకుంటే సామాజిక రాజకీయ, ప్రాంతీయ సమీకరణలు ఏవీ ఇపుడు గంటాకు సానుకూలంగా లేవనే అర్ధమవుతోని. మరి గంటా టీడీపీలో కొనసాగితే మునుపటి ఆదరణ ఉంటుందా. ఆయన కోరుకున్న సీటు దక్కుతుందా అంటే చెప్పలేం అన్న సమాధానమే వస్తోంది. మరి రాజకీయ ఘనాపాటి అయినా ఈ రోజుకు మౌనంగా ఉంటే ఉండవచ్చు కానీ ఆయన రాజకీయ వ్యూహాలు ఆయనకు ఉన్నాయని అనుచరులు అంటున్నారు. చూడాలి ఆయన ఏ ట్రంప్ కార్డ్ బయటకు తీస్తారో.