Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్ డీఎన్ ఏపై ప్రభావం చూపనుందా..?

By:  Tupaki Desk   |   16 Nov 2020 11:30 AM GMT
కరోనా వ్యాక్సిన్ డీఎన్ ఏపై ప్రభావం చూపనుందా..?
X
కరోనా మహమ్మారి పూర్తిగా తొలిగిపోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే దారి. వైరస్ ప్రారంభమైనప్పటి నుంచి కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం ఆయా దేశాలు తీవ్రంగా క్రుషి చేస్తున్నాయి. భారత్ లోనూ పలు కంపెనీ కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇటీవల అమెరికాకు చెందిన ‘ఫైజర్’ అనే వ్యాక్సిన తుది దశకు వచ్చిందని, ఇక పంపిణీయే తరువాయి అని ట్రంప్ ప్రభుత్వం సైతం ప్రకటించింది. దీంతో భారత్ లోనూ ఈ వ్యాక్సిన్ ను పంపిణీకి చర్యలు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు పేర్కంటున్నారు.

ఫైజర్ అనే వ్యాక్సిన్ కాకుండా పలు కంపెనీలు సైతం వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నాయి. అయితే కరోనా వ్యాక్సిన్ మానవ శరీరంలోకి ఎక్కిస్తే సేఫ్ గానే ఉంటుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఒక వ్యాక్సిన్ పేరిట ఒక మైక్రో చిప్ ను మానవ శరీరంలోకి పంపిస్తారని, ఇది ట్రేస్ చేయడానికి ఉపయోగపడుతుందనే వార్తలు వస్తున్నాయి. దీనికి వెనుక బిల్ గేట్స్ హస్తముందని సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

‘ఫైజర్ వ్యాక్సిన్ తో జర భద్రం‘ అంటూ ట్రంప్ నకు అనుకూలమైన ‘న్యూస్ మాక్స్’ అనే వెబ్ సైట్ నుంచి వైట్ హౌజ్ కరస్పాండెంట్ ఎమరాల్డ్ రాబిన్సన్ ట్వీట్ చేశారు. ‘ఈ వ్యాక్సిన్ మీ డీఎన్ఏను దెబ్బతీస్తుంది. ట్రయల్స్ లో పాల్గొన్న 75 శాతం మందికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చాయి’ అని రాబిన్సన్ ట్వీట్ చేశారు.

మరోవైపు ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తలు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. వైరస్ తాలుకా జన్యు పదార్థంలోని ఒక చిన్న భాగాన్ని వ్యాక్సిన్ తయారీలో వాడుతారు. దీన్నే ‘ఆర్ఎన్ఏ’అంటారు. ఆర్ఎన్ఏ మానవ శరీరంలోకి ఎక్కిస్తే అది కణాల్లోని డీఎన్ఏపై ఏ రకమైన ప్రభావం చూపదు’ అని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జెఫ్రీ ఆల్మండ్ తెలిపారు. ఫైజర్ వ్యాక్సిన్ మానవ శరీరంలోని డీఎన్ఏ క్రమాన్ని మార్చదని, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని మరో శాస్త్రవేత్త ఆండ్రూ విడ్జెర్ స్పష్టం చేశారు.

ఒక వైపు వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధమవుతుండగా ఇలాంటి వదంతులు రావడంతో ఆందోళన కలిగిస్తోంది. అయితే ఫైజర్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న వాదనను శాస్త్రవేత్తలు కొట్టిపారేయలేదు. కానీ ఈ వ్యాక్సిన్ తో 75 శాతం మందికి పలు అనారోగ్యాలు వచ్చాయన్న వార్త మాత్రం వాస్తవం కాదంటున్నారు.