Begin typing your search above and press return to search.
కరోనా : ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో ఏది బెస్ట్..తేడా ఏంటి ?
By: Tupaki Desk | 26 April 2021 4:30 PM GMTకరోనా వైరస్...ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిపోయేలా చేస్తుంది. ఈ మహమ్మారి నిర్దారణ కోసం ప్రస్తుతం ర్యాపిడ్ టెస్ట్ , అలాగే ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనే రెండు పద్దతుల ద్వారా కరోనా వైరస్ ను నిర్దారిస్తున్నారు. ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్టులను పాయింట్ ఆఫ్ కేర్ అని పిలుస్తారు. అంటే వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లి చేసుకోవచ్చు. అదే ఆర్టీపీసీఆర్ కు పెద్ద ల్యాబొరేటరీ ఎక్విప్‌మెంట్ ఉండాలి. ట్రూనాట్ అనేది ఒక చిప్ బేస్డ్ టెస్టింగ్. మన శరీరంలో ఎక్కువ జీన్ లు ఉంటాయి.
అయితే ఇది కొన్ని జీన్ లను మాత్రమే వెలుగులోకి తీసుకువస్తుంది. వీటిలో వైరస్ ఉందో లేదో మాత్రమే గుర్తిస్తుంది. తక్కువ సమయంలో రిజల్ట్ వస్తుంది. అదే ఆర్టీపీసీఆర్ లో ఎక్కువ జీన్ లను గుర్తించే అవకాశం ఉంటుంది. కేసులు ఎక్కువవుతున్నాయి కాబట్టి, తక్కువ సమయంలో రిజల్ట్ వస్తుంది కాబట్టి, అలాగే ఎక్కడైనా టెస్టు చేసేందుకు అవకాశం ఉందన్న ఉద్దేశంతో ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులకు అనుమతి ఇచ్చారు. గొంతులో ద్రవం తీసి కిట్‌పై వేస్తే 10 నిమిషాల్లో రిజల్ట్ వస్తుంది. ఇందులో పాజిటివ్ వస్తే తిరిగి ఆర్టీపీసీఆర్ కు వెళ్లి నిర్ధారించుకోవచ్చు. ఆర్టీపీసీఆర్ నే గోల్డెన్ స్టాండర్డ్ టెస్టుగా చెప్పుకోవాలి. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత 5–7 రోజుల మధ్య డీడైమర్, హెచ్ ఆర్ సీటీ థొరాక్స్ వంటి టెస్టులు చేయించుకోమని సలహా ఇస్తాం. వైరస్ ప్రభావంతో రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంది. డీడైమర్ లెవల్స్ పెరుగుతుంటే దాని ప్రభావం రక్తం మీద పడుతోందని అర్థం. అప్పుడు రక్తం గడ్డ కట్టకుండా వైద్యుల సూచనల మేరకు బ్లడ్ థిన్నర్స్ వాడాలి. ఇక కోవిడ్ వల్ల ఊపిరితిత్తులు ఇన్ ఫెక్షన్ కు గురవుతున్న విషయం తెలిసిందే. నిమోనియా శాతం తెలుసుకోవడానికే హెచ్ ఆర్ సీటీ థొరాక్స్ టెస్టు. దీనిద్వారా ఊపిరితిత్తులపై వైరస్ ప్రభావం పడిందా లేదా అని తెలుసుకోవచ్చు అని నిపుణులు చెప్తున్నారు.