Begin typing your search above and press return to search.
సర్జరీ చేస్తుండగా మూడున్నర గంటలు ఆగిపోయిన గుండె.. అయినా బతికించిన వైద్యులు!
By: Tupaki Desk | 15 Sep 2022 4:47 AM GMTసాధారణంగా మనిషి గుండె మూడు నిమిషాలు కొట్టుకోకపోతే ఇక ఆ వ్యక్తి మరణించినట్టేనని అని వైద్యులు చెబుతారు. అలాంటిది ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరంలో ఓ మహిళ గుండె దాదాపు 210 నిమిషాలపాటు అంటే ఏకంగా మూడున్నర గంటలపాటు ఆగిపోయింది. అయినా ఆ మహిళ ప్రాణాలతో బతికి బట్టకట్టింది. వైద్య శాస్త్రంలో అపురూప ఘట్టంగా ఈ సంగతిని చెబుతున్నారు.. వైద్యులు. ఇందుకు మీరట్ నగరంలోని లాలా లజపత్ రాయ్ మెమోరియల్ వైద్య కళాశాల వేదికైంది.
ఓ మహిళ గుండెకు శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో ఆమె గుండె దాదాపు మూడున్నర గంటలపాటు ఆగిపోయింది. అయినా వైద్యులు ఆశలు వదులుకోకుండా ఆపరేషన్ నిర్వహించారు. దాన్ని విజయవంతం చేసి ఆమెకు ప్రాణం పోశారు.
వైద్య శాస్త్రంలోని మిరాక్సిల్ లో ఒకటిగా చెప్పబడుతున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...ఉత్తరప్రదేశ్లోని కంకరఖేడాకు చెందిన కవిత అనే 34 ఏళ్ల మహిళ గత రెండేళ్లుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతోంది.
పనులు చేస్తుంటే అలసటగా ఉండటం, తరచూ ఛాతి నొప్పి వస్తుండటంతో ఆస్పత్రికి వెళ్లింది. ఇలా ఎన్నో ఆస్పత్రులకు తిరిగినా వెయిటింగ్ లిస్ట్ కారణంగా ఆమె చికిత్స పొందలేకపోయింది. ఇక చివరకు మీరట్‌లోని లాలా లజపత్ రాయ్ మెమోరియల్ వైద్య కళాశాలకు వెళ్లింది.
మీరట్ మెడికల్ కాలేజీలోని కార్డియో థొరాసిక్ విభాగం వైద్య నిపుణులు కవితకు పరీక్షలు చేశారు. ప్రాథమిక పరీక్షల్లో మిట్రాల్ వాల్వ్ దెబ్బతిన్నట్లు స్పష్టమైంది. దీంతో వెంటనే ఆపరేషన్ చేయాలని ఆమెకు తెలిపారు.
యంత్రం సహాయంతో మెకానికల్ హార్ట్ వాల్వ్ను కవితకు విజయవంతంగా అమర్చారు. ఈ క్రమంలో ఆమె గుండె మూడున్నర గంటలపాటు స్తంభించిపోయింది. ఏం జరుగుతోందో డాక్టర్లకు సైతం అర్ధం కాలేదు. అయితే ఆమెకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి ఆమెకు జీవం పోశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.