Begin typing your search above and press return to search.

మోడీకి జ‌గ‌న్ అవ‌స‌రం ఉండగా.. బాబును ప‌ట్టించుకుంటారా ?

By:  Tupaki Desk   |   24 Oct 2021 2:30 AM GMT
మోడీకి జ‌గ‌న్ అవ‌స‌రం ఉండగా.. బాబును ప‌ట్టించుకుంటారా ?
X
ఇప్పుడు ఇదే విష‌యంపై మేధావులు కూడా దృష్టి పెట్టారు. చంద్ర‌బాబు వంటి అత్యంత సీనియర్ నాయ కుడు.. చేసిన ప్ర‌క‌ట‌న‌.. అంత తేలిక‌గా తీసుకునేందుకు అవ‌కాశం లేదు. దీనివెనుక ఏదో ఉంటుంద‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. త‌న పార్టీ కార్యాల‌యంపై దాడికి నిర‌స‌న‌గా ఆయ‌న దీక్ష చేశారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాల‌ని.. ఆర్టిక‌ల్ 356ను ప్ర‌యోగించాల‌ని ఆయ‌న కోరుతున్నారు. ఇది సాధ్య‌మేనా..? అస‌లు ఎప్పుడు రాష్ట్ర‌ప‌తి పాల‌న పెడ‌తారు? ఎందుకు పెడ‌తారు? అనే చ‌ర్చ సాగుతోంది. దీనిని కొంత లోతుగా ప‌రిశీలిస్తే.. విష‌యాలు తెలుస్తాయి.

ఏ రాష్ట్రంలో అయినా.. ప‌రిస్థితి దిగ‌జారి పోయిన‌ప్పుడు.. రాష్ట్ర‌ప‌తి పాల‌న పెడుతున్నారు. అది కూడా స‌ద‌రు రాష్ట్ర గ‌వర్న‌ర్‌.. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు లేవ‌ని.. ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డుతున్నార‌ని.. నివేదికను ఇవ్వాలి. దానిపై ఒక క‌మిటీని వేసి.. కేంద్రం నిర్దారించుకోవాలి. పోనీ.. గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన నివేదిక‌పైనే ఆధార‌ప‌డినా.. దీని వెనుక రాజ‌కీయ కార‌ణాల‌ను కూడా ప‌రిశీలించుకోవాలి. ఇవ‌న్నీ అయిన త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల‌కు కేంద్రం వివ‌ర‌ణ ఇవ్వాలి. అప్పుడు మాత్ర‌మే రాష్ట్ర‌ప‌తి పాల‌న విధిస్తారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో రెండు సంద‌ర్భాల్లో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించారు.

ఇటీవ‌ల రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. త‌లెత్తిన రాజ‌కీయ అస‌మ‌తౌల్యానికి కార‌ణంగా కేంద్రం అప్ప‌టి యూపీఏ ప్ర‌భుత్వం రాష్ట్ర‌ప‌తి పాల‌న‌ను పెట్టింది. కానీ.. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి రాష్ట్రంంలో ఉందా? ఉంద‌నేందుకు గ‌వ‌ర్న‌ర్ ఒప్పుకొంటారా? చంద్ర‌బాబు ఫిర్యాదు చేసినా.. కేంద్రం గ‌వ‌ర్నర్‌ను నివేదిక కోరుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు బీజేపీకి అత్యంత వ్య‌తిరేక‌మైన పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్‌. ప‌శ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు.. మ‌మ‌తా బెన‌ర్జీపై స్వ‌యంగా గ‌వ‌ర్న‌ర్ నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలో ప‌రిస్థితి అదుపు త‌ప్పింద‌ని.. రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని ఆర్ ఎస్ ఎస్ సానుభూతిప‌రుడైన గ‌వ‌ర్న‌ర్ నివేదిక ఇచ్చారు.

అయితే.. స‌దరు నివేదిక ఆధారంగా రాష్ట్రంలో గ‌వ‌ర్నర్ పాల‌న ఏర్పాటు చేస్తార‌ని అంద‌రూ అనుకున్నా.. బీజేపీ పెద్ద‌లు వెనుక‌డుగు వేశారు. న్యాయ‌ప‌ర‌మైన స‌ల‌హా తీసుకున్నారు. దాని ప్ర‌కారం.. నిజంగానే రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగిందని తెలిసినా.. త‌మ‌కు ఎక్క‌డ చెడ్డ‌పేరు వ‌స్తుందోన‌నే భ‌యంతో వెన‌క్కి త‌గ్గారు. ఇక‌, ఏపీలోనూ ఇంతే. పైగా.. జ‌గ‌న్‌తో మోడీ కి ఎన్నో అవ‌స‌రాలు ఉన్నాయి. పైగా.. వ‌చ్చే లోక్‌స‌భ స‌మావేశాల్లో కీల‌క‌మైన బిల్లులు ప్ర‌వేశ పెట్టాలి. వాటికి రాజ్య‌స‌భ‌లో జ‌గ‌న్ మ‌ద్ద‌తు అవ‌స‌రం. సో.. ఇవ‌న్నీ .. చూస్తే.. చంద్ర‌బాబు కోరుతున్న‌ట్టు.. ఇక్క‌డ రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టేందుకు అవ‌కాశం లేక‌పోగా.. ఉన్నా పెట్టే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు అని అంటున్నారు ప‌రిశీల‌కులు.