Begin typing your search above and press return to search.

సభలో నిర్మలా ప్రసంగం ... నిద్రలోకి జారుకున్న మంత్రులు !

By:  Tupaki Desk   |   28 Nov 2019 11:04 AM GMT
సభలో నిర్మలా ప్రసంగం ... నిద్రలోకి జారుకున్న మంత్రులు !
X
అప్పుడప్పుడు రాజకీయాలలో కూడా కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటుంటాయి. అసెంబ్లీ లో కానీ , పార్లమెంట్ లో కానీ సమావేశాలు జరుగుతున్నప్పుడు సభలోని సభ్యులు చిన్నగా నిద్రలోకి జారుకోవడం మనం ఎన్నోసార్లు చూసే ఉంటాం. అలాంటి ఘటనే తాజాగా రాజ్యసభలో జరిగింది. కానీ , ఒక మంత్రి దేశంలోనే అత్యంత కీలకమైన సమస్య పై మాట్లాడుతున్న సమయంలో తన సహచర మంత్రులు అభినందించాల్సిపోయి నిద్రపోతూ కనిపించారు. మంత్రులు నిద్రపోతున్న ఫోటోలు బయటకి రావడంతో దీనిపై నెటిజన్స్ పలురకాలుగా స్పందిస్తున్నారు.

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక వ్యవస్థపై రాజ్యసభలో ప్రసంగిస్తుండగా పలువురు కేంద్రమంత్రులు ఎంపీలు నిద్రపోతూ కనిపించారు. ఆమె ప్రసంగం వారికి జోలపాటలా ఉన్నిందో ఏమో తెలియదు కానీ మొత్తానికి కునుకు తీస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఇప్పుడు ఈ దృశ్యాలే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఉంది తప్ప ఆర్థికమాండ్యం లేదని పార్లమెంటులో ఆర్థిక శాఖ మంత్రి ..విపక్షలకి దీటైన సమాధానం ఇస్తుంటే ..మంత్రులు నిద్రపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి దేశ ఆర్థిక వ్యవస్థ పై సుదీర్ఘంగా ప్రసంగిస్తున్న సమయంలో కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే గురక పెడుతూ నిద్రపోతున్న సమయంలో కెమెరాలు క్లిక్ మనిపించాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకున్న విధానాపరమైన నిర్ణయాలు తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను పోలుస్తూ ప్రసంగించారు. తాను ఆర్థిక మంత్రిగా ప్రవేశ పెట్టిన తొలి బడ్జెట్‌లోని అంశాలు అమలు చేస్తున్నామని ఇప్పటికే మంచి ఫలితాలు వస్తున్నాయని ఆమె రాజ్యసభకు తెలిపారు. ఇన్ని చెబుతున్నప్పటికీ సభలో కూర్చున్న ఎంపీలు కానీ మంత్రులను కానీ ఆకట్టుకోలేకపోయారు. బల్లలు చరచడం మానీ నిదానంగా నిద్రలోకి జారుకున్నారు.

ముందుగా రాజ్యసభలో నిర్మలా సీతారామన్ ప్రసంగం ప్రారంభించగానే ఒక ఎంపీ నిద్రలోకి జారుకున్నారు. ప్రసంగం సాగిస్తుండగా మరో ఎంపీ కునుకు తీశారు. ఆ తర్వాత ఆర్ధికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ కూడా నిద్రపోవడం కనిపించింది. అయితే ఆయన తేరుకుని తన పక్కనే నిద్రలోకి జారుకున్న మరో ఇద్దరిని నిద్రలేపడం కనిపించింది. ఇప్పుడు ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. సమస్యలపై మాట్లాడమని ఎంపీలను పార్లమెంటుకు పంపిస్తే వారు గురక పెట్టి నిద్రపోతున్నారని కొందరు నెటిజెన్లు కామెంట్ చేశారు.