Begin typing your search above and press return to search.
టీడీపీ మేనిఫెస్టో సంగతి సరే.. మన జీవోల సంగతేంటి?: వైసీపీలో గుసగుస
By: Tupaki Desk | 30 July 2022 1:30 AM GMTవైసీపీలో ఏ ఇద్దరు నాయకులు కలిసినా.. ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం పారదర్శక తకు పెద్దపీట వేస్తోందని.. సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు. ఎక్కడ ఏ సభ పెట్టినా.. ఎక్కడ మాట్లాడా ల్సి వచ్చినా.. ఆయన ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఇది మంచిదే.. ఏ ప్రభుత్వమైనా పారదర్శకంగా.. తమకు పాలన అందించాలనే ప్రజలు కోరుకుంటారు. అయితే.. వైసీపీ ప్రభుత్వం చెబుతున్న ఈ పారద ర్శకత.. కేవలం నేతిబీర చందమేననే విమర్శలు తరచుగా.. టీడీపీ నుంచి వినిపిస్తున్నాయి.
అయితే.. ఇప్పుడు ఇదే చర్చ.. వైసీపీలోనూ సాగుతుండడం గమనార్హం. వైసీపీ అధినేత సీఎం జగన్ సహా పలువురు నాయకులు తరచుగా.. టీడీపీ గురించి విమర్శలు చేస్తూ.. వైసీపీకి మేనిఫెస్టోనే గీత, బైబిల్, ఖురాన్ అని వ్యాఖ్యానిస్తుంటారు. అదేసమయంలో టీడీపీ గత పాలనలో మేనిఫెస్టోను దాచేసిందని.. కనీసం.. ప్రజలకు అందులో 10 పర్సంట్ కూడా అమలు చేయలేదని విమర్శలు గుప్పిస్తుంటారు. సరే.. మేనిఫెస్టోను దాచేసిన.. టీడీపీ సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు మన ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోల సంగతేంటనేది.. వైసీపీ నేతల గుసగుస.
విధానపరమైన నిర్ణయాలపై జారీచేసే జీవోల్ని ఇప్పటికీ అత్యంత రహస్యంగా ఉంచుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై వైసీపీలోనే చర్చజరుగుతోంది. అందరికీ అందుబాటులో ఉండాల్సిన జీవోల్ని ప్రభుత్వం ఇప్పటికీ దాచిపెడుతోందని కొందరు పేరు చెప్పడానికి ఇష్టపడని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. జీవోఐఆర్ వెబ్‌సైట్‌లో జీవోలు పెట్టడం దాదాపు ఏడాది క్రితమే ప్రభుత్వం నిలిపివేసింది. దీనిని హైకోర్టు తప్పుబట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఏపీ ఇ-గెజిట్ పోర్టల్‌లో అరకొరగా జీవోల్ని అప్‌లోడ్ చేసి మమ అనిపిస్తోందనే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రజలు ప్రశ్నిస్తారనో, కోర్టుకు వెళతారనో, తనకు ఇబ్బంది వస్తుందనో అనుకున్న ఏ జీవోనూ ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ఉంచడం లేదని పరిశీలకులు కూడా చెబుతున్నారు. బదిలీల జీవోల్లోనూ ఒకటీ అరా మాత్రమే ఆన్‌లైన్‌లో పెడుతున్నారు. ప్రస్తుతం ఏపీ ఇ-గెజిట్‌లో కూడా, ఎప్పుడో రెండు మూడు నెలల క్రితం జారీ అయిన జీవోల్నీ... అప్‌లోడ్ చేస్తున్నారు.
ప్రజలకు పారదర్శక పాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి, మంత్రులు గొప్పలు చెప్పడమే తప్ప ఆచరణలో పూర్తి భిన్నంగా జరుగుతోందని, రహస్య జీవోలే దానికి నిదర్శనమని విపక్షాలు సైతం మండిపడుతున్నాయి. ఎవరెంత విమర్శించినా, విన్నవించినా ప్రభుత్వం మాత్రం తన మానాన తనువ్యవహరిస్తుండడం గమనార్హం. టీడీపీ తన మేనిఫెస్టోను దాచేసినా.. ఎవరికీ ఇబ్బంది రాలేదని.. కానీ, సర్కారు ఇలా.. ప్రజలకు సంబంధించిన జీవోలు దాచేయడం ఎందుకనేది.. వైసీపీలోనే జరుగుతున్న చర్చ. మరి దీనిపై సర్కారు పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.