Begin typing your search above and press return to search.

సీఎం అవినీతిని బ‌య‌ట‌పెడితే... కాల్చేశారు

By:  Tupaki Desk   |   1 Jun 2017 10:50 AM GMT
సీఎం అవినీతిని బ‌య‌ట‌పెడితే... కాల్చేశారు
X
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ మ‌రో వివాదంలో ప‌డింది. కోెట్లాది రూపాయల కుంభకోణాన్ని వెలుగులోనికి తీసుకువచ్చిన విజిల్ బ్లోయెర్ పై గ్రేటర్ నోయిడాలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. రాహుల్ శర్మ ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల నుంచి ఆయన సురక్షితంగా తప్పించుకున్నారు. కాగా ఈ వార్త దేశ రాజ‌ధానిలో క‌ల‌క‌లం రేకెత్తించింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బంధువు ప్రమేయం ఉన్న ఈ కుంభకోణాన్ని వెలుగులోనికి తీసుకు వచ్చిన రాహుల్ శర్మ త‌న ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని గ‌తంలోనే తెలిపారు. ఈ క్ర‌మంలోనే ఈ ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ప్ర‌జావేగు రాహుల్ శ‌ర్మ‌పై కాల్పులు జరిపారు. దీంతో ఢిల్లీలోని విప‌క్షాలు ఆప్ స‌ర్కారు ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు గుప్పించాయి.

మ‌రోవైపు ఢిల్లీ సెక్రటేరియెట్ సహా పలు ప్రభుత్వ కార్యాలయాలలో ఈ రోజు ఉదయం నుంచి ఏసీబీ తనిఖీలు ప్రారంభించింది. ఆరోగ్య శాఖలో అవినీతిపై ఇటీవల ఆప్ బహిష్కృత నేత కపిల్ మిశ్రా చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఢిల్లి ప్రభుత్వం మందుల కొనుగోలులో అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలపై అవినీతినిరోధక శాఖ (ఎసిబి) అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఢిల్లిలోని వివిధ ప్రాంతాల్లో వారు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, మంత్రి సత్యేంద్ర జైన్లపై ఆమ్‌ ఆద్మీపార్టీ (ఆప్‌) రెబెల్‌ నాయకుడు కపిల్‌ మిశ్రా తాజాగా ఆరోపణలు చేశారు. ఆరోగ్యశాఖ నిధులను కేజ్రీవాల్‌, సత్యేంద్ర జైన్‌లు దుర్వినియోగం చేశారని కపిల్‌ మిశ్రా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎసిబి అధికారులు మందుల కుంభకోణంపై దర్యాప్తు ప్రారంభించారు. మ‌రోవైపు ఆప్ బహిష్కృత నేత కపిల్ మిశ్రా తాను బాపూఘాట్ సందర్శించి మహాత్మాగాంధీ సమాధికి నివాళులర్పించనున్నట్లు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీలో నిన్న ఆప్ ఎమ్మెల్యేలు కపిల్ మిశ్రాపై దాడి చేసి ముష్టిఘాతాలు విసిరిన సంగతి తెలిసిందే. అవినీతిపై తన పోరాటంలో నిర్భయంగా ముందుకు సాగుతానని చెప్పిన కపిల్ మిశ్రా బాపూఘాట్ సందర్శించి బాపూజీ ఆశీస్సులు తీసుకుంటానని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/