Begin typing your search above and press return to search.
ఒకే వ్యక్తిలో బ్లాక్ ఫంగస్.. వైట్ ఫంగస్!
By: Tupaki Desk | 23 May 2021 11:30 AM GMTకరోనా మహమ్మారి భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్న జనాలను.. ఇప్పుడు సరికొత్త రోగాలు బెంబేలెత్తిస్తున్నాయి. నిన్నామొన్నటి వరకు బ్లాక్ ఫంగస్ హడలెత్తించగా.. ఇప్పుడు వైట్ ఫంగస్ భయపెడుతోంది. కరోనా నుంచి కోలుకునే క్రమంలో అధికంగా స్టెరాయిడ్స్ వినియోగించిన వారిలో ఈ బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ వెలుగు చూస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అధికంగా స్టెరాయిడ్స్ వినియోగం వల్ల ఇమ్యూనిటీ పవర్ దెబ్బ తింటోందని, దాంతోనే ఈ ఫంగస్ ప్రభావం చూపుతోందని అంటున్నారు. దీంతో.. కరోనా నుంచి కోలుకున్న వారిని ఈ ఫంగస్ భయం కూడా వెంటాడుతోంది. అయితే.. ఇప్పటి వరకు ఒక వ్యక్తిలో ఒక ఫంగస్ గుర్తించడం సాధారణ విషయంగా ఉంది. కానీ.. ఒకే వ్యక్తిలో రెండు రకాల ఫంగస్ ను గుర్తించిన అరుదైన ఘటన తాజాగా వెలుగు చూసింది.
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఓ రోగిలో బ్లాక్ ఫంగస్ తోపాటు వైట్ ఫంగస్ ఉండడాన్ని వైద్యులు గుర్తించినట్టు సమాచారం. దేశంలో ఈ తరహా కేసు నమోదవడం.. ఇదే మొదటి సారి కావడం గమనార్హం. అయితే.. ఆ తర్వాత భోపాల్ లో కూడా ఇలాంటి కేసు ఒకటి నమోదైందని తెలుస్తోంది.