Begin typing your search above and press return to search.
భయపడుతున్న ట్రంప్ ...వైట్ హౌస్ చుట్టూ భారీ కంచె !
By: Tupaki Desk | 5 Jun 2020 11:30 PM GMTఅగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పైకి కొంచెం గంభీరంగా కనిపిస్తున్నా కూడా ఏ సమయంలో ఏ ఆపద ముంచుకొస్తుందో అని భయపడుతున్నట్టు అర్థమౌతుంది. తన దగ్గరకు ఎవరూ రాలేరంటూ రెచ్చగొట్టే కామెంట్లు చేసిన ట్రంప్, ఇప్పుడు వైట్‌హౌస్ చుట్టూ భారీ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆఫ్రో-అమెరికన్ల ఆందోళనల ఉదృతి రోజురోజుకి పెరిగిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పెన్సింగ్ దాటకుండా పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నారు. అదనపు బలగాలు సైతం మోహరించాయి. ఓ ఫోర్జరీ కేసులో విచారణ కోసం జార్జ్ ఫ్లాయిడ్ అనే ఆఫ్రికన్ యువకుణ్ని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకొని , అతన్ని ఊరిరాడకుండా చేయటంతో అతను చనిపోయాడు. డెరెక్ చౌవిన్ అనే పోలీస్ అతని వీపుపై కాలితో అత్యంత క్రూరంగా చంపాడు. దీనితో అమెరికాలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇంకెంత కాలం ఈ వర్ణ వివక్ష అని, పోలీసులు నల్ల జాతియుల్ని టార్గెట్ చేయటం మానుకోవాలని నిరసనలు చేస్తున్నారు.
ఈ నిరసన కారులు శుక్రవారం రాత్రి జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా... వైట్ హౌస్ ముట్టడికి ప్రయత్నించారు ఆందోళనకారులు. అక్కడ బారికేడ్లకు నిప్పు పెట్టారు. దీంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా... వైట్ హౌస్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు.