Begin typing your search above and press return to search.
అది సర్వసాధారణం: అన్ ఫాల్ పై వైట్ హౌస్ వివరణ
By: Tupaki Desk | 30 April 2020 10:53 AM GMTఅకస్మాత్తుగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ - ప్రధానమంత్రి నరేంద్ర మోదీ - ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ ఖాతాలను అమెరికా అన్‌ఫాలో చేసింది. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. అమెరికా దురంహకారానికి నిదర్శనమని పేర్కొంది. ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ అమెరికా అధికారిక భవనం వైట్ హౌస్ (శ్వేతసౌధం) స్పందించింది. అన్ ఫాలో పై వివరణ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలోనే.. విదేశీ పర్యటనలో సమయంలో అమెరికా అధ్యక్ష భవనం ఆయా దేశ అధినేతలు, వారి కార్యాలయాలను ట్విట్టర్ లో తాత్కాలికంగా మాత్రమే అనుసరిస్తుందని వైట్‌హౌస్ స్పష్టం చేసింది.
తమ అధ్యక్షుడి పర్యటన పూర్తయిన తర్వాత వాటిని అన్ ఫాలో చేయడం సాధారణ ప్రక్రియ అని ఓ ప్రకటనలో వెల్లడించింది. ట్రంప్ భారత్ లో పర్యటించడంతో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి నెలలో భారత్ పర్యటించిన సమయంలో శ్వేతసౌధం భారత రాష్ట్రపతి - ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు ఆరు ట్విట్టర్ ఖాతాలను అనుసరించినట్లు వివరణ ఇచ్చింది.
తమ దేశాధ్యక్షుడి పర్యటన ముగియడంతో ఇటీవల భారతదేశానికి సంబంధించిన ఆరు ట్విటర్ ఖాతాలను వైట్ హౌస్ అన్ ఫాలో చేసిన విషయం తెలిసిందే. దీనిపై భారతీయ ప్రజల నుంచి నిరసన వ్యక్తమైన నేపథ్యంలో పై విధంగా శ్వేతసౌధ వివరణ ఇచ్చింది. అయితే ఈ అన్ ఫాలోపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు.
భారత రాష్ట్రపతి - ప్రధానమంత్రి ట్విట్టర్ ఖాతాలను వైట్ హౌస్ అన్ ఫాలో చేయడంతో దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ గమనించాలని కోరుతున్నట్లు బుధవారం ట్విట్టర్ లో కోరారు.
వైట్ హౌస్ ట్విటర్ ఖాతాను పరిశీలిస్తే కేవలం 13 ఖాతాలనే ఫాలో అవుతోంది. ఆ అన్ని ఖాతాలు అమెరికాకు చెందినవే. వాటిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - ఆయన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ - ప్రథమ మహిళ - ఉపాధ్యక్షుడు - రెండవ మహిళ - న్యూ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్ నానీ - జాతీయ భద్రతా మండలి -మాజీ వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి స్టెఫానీ గ్రిషామ్ తదితరులు ఉన్నారు. అయితే వైట్‌హౌస్ ట్విట్టర్ ఖాతాను మాత్రం దాదాపు రెండు కోట్ల మంది ఫాలో అవుతున్నారు.