Begin typing your search above and press return to search.

డబ్ల్యూహెచ్‌ఎన్ హెచ్చరిక.. మంకీపాక్స్తో లక్షల్లో మరణాలు

By:  Tupaki Desk   |   24 Jun 2022 6:31 AM GMT
డబ్ల్యూహెచ్‌ఎన్ హెచ్చరిక.. మంకీపాక్స్తో లక్షల్లో మరణాలు
X
ఓవైపు కరోనా మళ్లీ కోరలు చాస్తోంటే.. మరోవైపు మంకీపాక్స్ ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తోంది. రోజురోజుకూ చాపకింద నీరులా విస్తరిస్తూ నెమ్మదిగా విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 58 దేశాల్లో మంకీపాక్స్ విలయతాండవం సృష్టిస్తోంది. ఈ వైరస్ వల్ల మరణాల రేటు తక్కువగా ఉన్నా.. వీలైనంత త్వరగా కట్టడి చేయకపోతే అనేక మంది అంధులుగా.. వికలాంగులుగా మారే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

మంకీపాక్స్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా తన పంజా విసురుతోంది. ఇప్పటికే 58 దేశాల్లో విస్తరించి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఆయా దేశాల్లో ఇప్పటి వరకు 3,417 మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

మరణాల రేటు తక్కువగా ఉన్నా.. వీలైనంత త్వరగా ఈ వైరస్ కట్టడికి చర్యలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. మంకీపాక్స్ వల్ల లక్షల మంది అంధులుగా, వికలాంగులా మారే అవకాశముందని డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

మంకీపాక్స్‌ నివారణ చర్యలకు పూనుకోకపోతే, వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యం కాదని డబ్ల్యూహెచ్‌ఎన్‌ తెలిపింది. ప్రపంచ దేశాల సమష్టి కృషితో ఈ మహమ్మారిని నిర్మూలించగలుగుతామని పేర్కొంది. ఇది మరింత వేగంగా వ్యాపించి ప్రపంచాన్ని అతలాకుతలం చేయకముందే అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. అందుకే ఈ మహమ్మారి వ్యాప్తిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది.

2020లో కరోనా ను మొదట్లో తక్కువగా అంచనా వేయడం వల్ల అది విజృంభించి లక్షల మంది ప్రాణాలు పొట్టన పెట్టుకుందని.. కానీ మంకీపాక్స్ విషయంలో అలా జరగకుండా ముందు జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్‌ఎన్‌ సూచించింది. కరోనా కంటే మంకీపాక్స్ కట్టడి చేయడం సులువని అభిప్రాయపడింది.

ఈ వ్యాధి సోకిన వారికి జ్వరం, దద్దుర్లు, శరీరంపై నీటి గుల్లల మాదిరి ఏర్పడతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ వ్యాధి 2 నుంచి 4 వారాల వరకు వేధిస్తుందని తెలిపింది. మంకీపాక్స్ సోకిన వారు తాకిన వస్తువులు తాకినా.. నేరుగా ముట్టుకున్నా ఇది మిగతా వారికి వ్యాపిస్తుందని పేర్కొంది. ఈ వ్యాధి సోకిన వారిని వీలైనంత త్వరగా క్వారంటైన్ చేయడం ద్వారా వ్యాప్తిని కట్టడి చేయొచ్చని తెలిపింది.