Begin typing your search above and press return to search.
ఎవరంటే?: వివేకా హత్య కేసులో ఆరుగురు అనుమానితులు
By: Tupaki Desk | 17 March 2019 5:59 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యను ఛేదించేందుకు ఏపీ సర్కారు సిట్ ను నియమించిన సంగతి తెలిసిందే. రాజకీయంగా సున్నితమైన ఈ కేసు విచారణను వేగంగా పూర్తి చేసే దిశగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ ఊపందుకుంది.
తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆరుగురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం కొందరిని.. శనివారం మరికొందరిని అదుపులోకి తీసుకున్న సిట్ బృందం విచారణ జరుపుతోంది. హత్య చోటు చేసుకోవటానికి దారి తీసిన పరిస్థితులు.. పరిణామాలపై విచారణ అధికారులు దృష్టి సారిస్తున్నారు.
రహస్య ప్రదేశంలో సాగుతున్న విచారణకు ఆరుగురు అనుమానితుల్ని విచారిస్తున్నట్లు సమాచారం. వీరిలో.. డ్రైవర్ ప్రసాద్.. వంటమనిషి లక్ష్మి.. వంట మనిషి కుమారుడు అశోక్.. వివేకానందరెడ్డి మాజీ పీఏ కృష్ణారెడ్డి.. ఇనయతుల్లా.. పని మనిషిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం.. ఆదివారం రాత్రి నాటికి ఈ కేసుకు సంబంధించిన ప్రాధమిక సమాచారాన్ని సిట్ బృందం వెల్లడించే వీలుందని చెబుతున్నారు. హత్యకు కారణాల్ని ఇప్పటికే గుర్తించారని.. అయితే.. ఇందుకు తగ్గ ఆధారాల్ని సంపాదించే అంశంపై పోలీసులు దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్నారు.