Begin typing your search above and press return to search.
వైఎస్ వివేకా హత్యపై మాజీ డ్రైవర్ చెప్పిన ఆ 8 మంది ఎవరంటే?
By: Tupaki Desk | 14 Nov 2021 5:04 AM GMTసంచలన అంశాలు బయటకు వచ్చాయి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసిన వైనం పెను సంచలనంగా మారటం తెలిసిందే. కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి ఎంతటి రక్షణ ఉంటుందో తెలిసిందే. అలాంటిది వైఎస్ వివేకాను ఆయన ఇంట్లోనే దారుణంగా చంపేయటం షాకింగ్ గా మారింది.
ఈ హత్య జరిగిన రెండున్నరేళ్ల తర్వాత.. తాజాగా సీబీఐకు.. దర్యాప్తు అధికారులకు సంచలన అంశాల్ని వెల్లడించారు ఆయన వద్ద పని చేసిన మాజీ డ్రైవర్ దస్తగిరి. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా వెలుగు చూశాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో ఆగస్టు 31న సీఆర్ పీసీ 164(1) ప్రకారం దస్తగిరి తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాల్ని కోర్టుకు సీబీఐ అందజేసింది. ఇందులో వైఎస్ వివేకా హత్యకు కీలకం ఎవరన్న విషయానికి మొత్తం 8 మంది పేర్లను వెల్లడించాడు.
హత్యలో కీలకమని చెబుతున్న 8 మంది ఎవరు? వారేం చేస్తుంటారు. వైఎస్ వివేకాకు ఏమవుతారు? అన్న విషయాల్ని చూస్తే.. ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. వైఎస్ వివేకాను హత్య చేసింది ఇంటి దొంగలే. ఆయనకు బంధురికం ఉన్న వారు.. ఆయన వద్ద పని చేసినోళ్లు.. నిత్యం సన్నిహితంగా ఉన్న వారి వల్లే సాధ్యమైందన్న సంగతి స్పష్టమవుతుంది. తాము అనుకున్నట్లు వివేకాను హత్య చేయాలని డిసైడ్ చేసి.. అందుకు పక్కా స్కెచ్ వేస్తున్న వేళ.. తాము అనుకున్నది అమలు చేసే వేళకు కాస్త ముందుగా ఇంట్లోని పెంపుడు కుక్కను కారుతో గుద్ది చంపేయటంతో హత్య పథకం అమలు మొదలైందని చెప్పాలి.
వైఎస్ వివేకాను హత్య చేసేందుకు ప్లాన్ చేయటం.. అమలు చేయటంలో 8 మంది కీలకమని దస్తగిరి వెల్లడించిన నేపథ్యంలో వారెవరు? అన్నది చూస్తే..
1. ఎర్ర గంగిరెడ్డి
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 ఏళ్లుగా వివేకాకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి. తరచూ ఆయనతో పాటే ఉండేవారు. హత్య తర్వాత.. అందులో పాల్గొన్న వారిలో కొందరికి అభయం ఇవ్వటంతో పాటు.. మీరేం భయపడొద్దు. వైఎస్ అవినాష్ రెడ్డితో మాట్లాడాను. వాళ్లు అంతా చూసుకుంటామన్నారంటూ ధైర్యం చెప్పినోడు. హత్య చేయటానికి వివేకా ఇంటికి వెళ్లినప్పుడు తలుపులు తీసినోడు.
2. గజ్జల ఉమాశంకర్ రెడ్డి
వివేకా వద్ద పీఏగా పని చేసిన జగదీశ్వర్ రెడ్డికి సోదరుడు. పాల డెయిరీ నిర్వహిస్తుండేవాడు. వైఎస్ వివేకా పొలం పనులు చూసేటోడు. గొడ్డలితో వైఎస్ వివేకా మీద దాడి చేసింది ఇతడే. కింద పడిన వివేకాపై గొడ్డలితో విరుచుకుపడి.. తలపై కొట్టాడు. ఆ తర్వాత బాత్రూంలోకి వివేకాను తీసుకెళ్లి.. వివేకా తలపై ఐదారుసార్లు గొడ్డలితో దాడి చేశాడు.
3. యాదటి సునీల్ యాదవ్
కడప జిల్లా పులివెందుల మండలంలోని మెట్నంతలపల్లె. జగదీశ్వర్ రెడ్డి ద్వారా వివేకాకు పరిచయమయ్యాడు. వివేకా హత్య చేసిన రోజున.. తొలుత బూతులు తిట్టినోడు. భూమి సెటిల్ మెంట్ విషయంలో వాటా కావాలంటూ గొడవ పెట్టుకున్న వేళ.. వివేకాను తొలుత బూతులు తిట్టినోడు. మొదట ఆయన్ను కొట్టి.. కిందకు పడేసినోడు. తర్వాత ఆయన మర్మాంగాలపై దాడి చేసి.. హత్యలో కీలకంగా వ్యవహరించినోడు.
4. దస్తగిరి
వైఎస్ వివేకా వద్ద 2017, 2018లో డ్రైవర్ గా పని చేశాడు. ఆ తర్వాత పని మానేశాడు. హత్య చేయలేనని చెప్పి.. రూ.5కోట్లు ఇస్తామంటే ఓకే చెప్పినోడు. హత్య చేయను కానీ.. హత్య చేయటానికి తన పూర్తి సహకారం అందిస్తానని చెప్పి.. అమలు చేసినోడు. తాజాగా సీబీఐకి వాంగ్మూలం ఇచ్చి.. తాము చేసిన హత్యను కళ్లకు కట్టినట్లుగా చెప్పినోడు. హత్య చేసే వేళలో.. వివేకా కుడి చేతిపైన గొడ్డలితో కొట్టి గాయపర్చినోడు.
5. డి. శంకర్ రెడ్డి
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి. కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి అనుచరుడు. సీబీఐకు ఏమీ చెప్పొద్దని.. జీవితంలో సెటిల్ అయ్యేలా చెస్తామని చెప్పాడు. విచారణ కోసం ఢిల్లీకి వెళ్లిన దస్తగిరి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నోడు.
6. వైఎస్ అవినాష్ రెడ్డి
కడప ఎంపీ. వైఎస్ వివేకాకు బంధువు. హత్య చేసిన తర్వాత ఏమీ జరగదన్న హామీ ఇవ్వటంలో కీలకభూమిక పోషించినోడు. డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలంలో అంతా చూసుకుంటామన్న అభయం ఇచ్చినట్లుగా సందేశాన్ని ఇచ్చినోడు. ఆరోపణలే కానీ.. హత్యలో ప్రత్యక్షంగా ఎక్కడా ఆనవాళ్లు లేవు.
7. వైఎస్ మనోహర్ రెడ్డి
వైఎస్ కుటుంబ సభ్యుడు.
8. వైఎస్ భాస్కర్ రెడ్డి