Begin typing your search above and press return to search.
సుప్రీం సీజేకు సీఎం జగన్ కంప్లైంట్ చేసిన హైకోర్టు జడ్జిలు వీరే
By: Tupaki Desk | 11 Oct 2020 7:30 AM GMTరెండు రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి.. ఏపీ హైకోర్టులోని పలువురు న్యాయమూర్తులు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై కంప్లైంట్ చేసిన సంచలన అంశాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ్ కల్లం వెల్లడించటం తెలిసిందే. సీఎం జగన్ కంప్లైంట్ చేసిన న్యాయమూర్తుల్లో ఎవరున్నారు? వారిపై ఎలాంటి ఫిర్యాదులు చేశారు? ఆ సందర్భంగా వారిపై చేసిన ఆరోపణలు ఏమిటి? అన్న వివరాలకు సంబంధించిన ఒక ప్రముఖ మీడియా వివరంగా సమాచారాన్ని వెల్లడించింది.
మిగిలిన మీడియాలతో పోలిస్తే.. సదరు మీడియా సంస్థ.. అజేయ్ కల్లం చెప్పిన మాటలతో పాటు.. ఆయన ఇచ్చిన ఆధారాల్ని భారీ ఎత్తున పబ్లిష్ చేసింది. అందులో ఏమేం పేర్కొన్నారు? అన్న వివరాల్ని చూస్తే.. ఆసక్తికరంగానే కాదు.. షాకింగ్ గా ఉన్నాయి. సుప్రీంకోర్టు సీజేకు ఏపీ హైకోర్టుకు చెందిన ఏయే న్యాయమూర్తులపై సీఎం జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ చేశారన్న విషయాన్ని ప్రముఖ మీడియాలో పబ్లిష్ చేసిన అంశాల్ని యథాతధంగా తీసుకుంటే..
జస్టిస్ కె. లలిత
- జడ్జిల్లో తెలుగుదేశం ప్రయోజనాలను కాపాడే వాళ్లలో జస్టిస్ కె. లలిత ఒకరు. మెడికల్ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టయ్యారు. ఆయన ఒక వారం రోజులు జైల్లో లేకుండానే.. ఆ జడ్జి ఆ మాజీ మంత్రిని ఆస్పత్రికి మార్చాలని ఆదేశాలిచ్చారు. తర్వాత ఇంకో ఆస్పత్రికి మార్చారు. తుదకు ఆస్పత్రి నుంచే విడుదల అయ్యే విధంగా బెయిల్ ఇచ్చారు. ఆ ఆదేశాలను ఆపాలని కోరుతూ ప్రభుత్వం వేసిన పిటిషన్లపై వాదనలు వినలేదు. దీంతో అచ్చెన్నాయుడుకు ప్రయోజనం చేకూరింది.
- అలాగే రక్షిత స్థలంలో ఉన్న ఇళ్లను, కట్టడాలను తొలగించడానికి గతంలో ఉన్న ఏపీసీఆర్‌డీఏ ప్రక్రియ మొదలు పెట్టింది. ఆ ఇళ్లలో చంద్రబాబు నివాసం కూడా ఉంది. ఆ ప్రక్రియపై స్టే ఉంది. వరదల సమయంలో నది నీళ్లు ఆ ఇళ్లలోకి చేరాయి. అలాగే ఆ కట్టడాలు ప్రవాహానికి ఆటకం కలిగించాయి.
జస్టిస్ డి.రమేష్
- జస్టిస్ రమేష్ ను క్రిమినల్ కేసుల్లో క్వాష్ పిటిషన్ల విచారణ, రిట్ పిటిషన్ల పరిధిలో వ్యూహాత్మకంగా ఉంచారు. గత ప్రభుత్వం హయాంలో అడ్వొకేట్ జనరల్‌కు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా జస్టిస్ రమేష్ ఉండేవారు. టీడీపీకి అనుబంధంగా ఉన్న వారి విషయంలో ఆయన తీరు అభ్యంతరకరంగా ఉంది.
- రమేష్ హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ రమేష్ దాఖలు చేసిన పిటిషన్‌కు అనుకూలంగా, ఆయనపై తదుపరి చర్యలు తీసుకోకుండా స్టే ఇచ్చారు. రమేష్ ఆస్పత్రి నిర్వహించిన కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 10 మంది చనిపోయిన విషయంలో జస్టిస్ రమేష్ ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ డాక్టర్ రమేష్ పరారీలోనే ఉన్నారు. జస్టిస్ రమేష్ ఆదేశాలను సుప్రీం కోర్టు పక్కన పెట్టింది.
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ కోరుతూ రాష్ట్ర ఎన్నికల అధికారి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కొన్ని రోజుల నిందితుడు అదే ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ కోరుతూ రెండో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణకు స్వీకరించినపుడు రెండు పిటిషన్లు కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. అయితే కారణాలు ఏమీ చెప్పకుండా జస్టిస్ రమేష్ మాత్రం దర్యాప్తుపై స్టే విధించారు.
సత్యనారాయణ మూర్తి
- జస్టిస్ సత్యనారాయణమూర్తి గత పది సంవత్సరాల నుంచి జస్టిస్ ఎన్వీ రమణకు విశ్వసనీయమైన వ్యక్తిగా ఉన్నారు. ప్రభుత్వంపై ఆయన వ్యతిరేకత ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పరిపాలనలో హైకోర్టు జోక్యం చేసుకున్న ప్రతి విషయంలోనూ ఆయన పాత్ర స్పష్టంగా కనబడుతుంది.
- రాజధానుల విచారణ విషయంలో అన్ని సందర్భాల్లో (ఆయన పక్కన కానీ లేదా ఫుల్ బెంచ్ అయినా కానీ) జస్టిస్ సత్యనారాయణ మూర్తి తనతో ఉన్నట్లు చీఫ్ జస్టిస్ నిర్ధారించారు. ప్రభుత్వ న్యాయవాదులపై ఆయన దారుణంగా వ్యవహరిస్తూ ఉంటారు.
- ఇంటర్ కాలేజీల సంఘం దాఖలు చేసిన పిటిషన్ విషయంలో.. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 365 విషయంలో అడ్వొకేట్ జనరల్‌కు సూచనలు చేస్తూ జస్టిస్ మూర్తి వ్యాఖ్యలు చేశారు.
- ఈ కేసులో కౌంటర్‌ను పట్టించుకోకుండా కేవలం పిటిషనర్ అఫిడవిట్ ఆధారంగా జస్టిస్ మూర్తి విచారణను రిజర్వ్‌లో ఉంచారు. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో కూడా పలుమార్లు ప్రభుత్వాన్ని ఆయన వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ పథకాలపై కూడా ఆయన పలుమార్లు విమర్శలు చేశారు.
- మాజీ అడ్వొకేట్ జనరల్, జస్టిస్ ఎన్వీ రమణకు ఆప్తుడు అయిన దమ్మాలపాటి శ్రీనివాస్‌పై నమోదైన క్రిమినల్ కేసు విషయంలో దర్యాప్తు కొనసాగకుండా జస్టిస్ మూర్తి స్టే ఇచ్చారు.
జస్టిస్ డి.సోమయాజులు
- పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నుంచి నవయుగ ఇంజనీరింగ్‌ను తొలగించిన విషయంలో ఆ కంపెనీ దాఖలు చేసిన రిట్ పిటిషన్ జస్టిస్ సోమయాజులు వద్దకు విచారణకు వచ్చింది. హైకోర్టు వెబ్‌సైట్‌లో ఆయన ప్రొఫైల్ చూస్తే.. జస్టిస్ సోమయాజులు గతంలో నవయుగ కంపెనీకి లీగల్ సలహాదారుగా ఉన్నారు.
- విచారణ సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించలేదు. ఆయన ఇచ్చిన ఆదేశాలను మరో జడ్జి వెకేట్ చేశారు. అయితే చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్.. జస్టిస్ సోమయాజులు ఇచ్చిన పూర్వ ఆదేశాలను తిరిగి అనుమతించింది.
- కేబినెట్ కమిటీ, సిట్ నివేదికలకు సంబంధించి అన్ని ప్రభుత్వ ఆదేశాలపై జస్టిస్ సోమయాజులు స్టే విధించారు. ఈ కేసు విషయంలో రిట్ పిటిషన్లు దాఖలు చేసిన వారు టీడీపీ కార్యకర్తలే. తమ పార్టీ ప్రతిష్టకు భంగం అంటూ ఆ పిటిషన్లు దాఖలు చేశారు.