Begin typing your search above and press return to search.
షర్మిల పార్టీతో కలిసి వచ్చే నేతలెవరు? కేసీఆర్‌కు సెగ పెడుతుందా?
By: Tupaki Desk | 10 Feb 2021 11:32 AM GMTరాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.. ఎవరూ చెప్పలేరు. అలాంటిదే.. ఇప్పుడు తెలంగాణలోనూ చోటు చేసుకుంది. నిన్నటి వరకు కేవలం ఏపీ రాజకీయాలకు మాత్రమే పరిమి తమవుతారని భావించిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు .. ఇప్పుడు తెలంగాణపై దృష్టి పెట్టారు. వైఎస్ కుమారుడు ఏపీలో అధికారంలోకి రాగా.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వైఎస్ కుమార్తె అడుగు లు వేస్తున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ఇప్పటికిప్పుడు వచ్చే మార్పులు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో చర్చ సాగుతోంది.
రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ.. షర్మిల చేసిన ప్రకటన.. తదుపరి ఆమె చేపట్టబోయే కార్యాచరణను స్పష్టం చేస్తోంది. వైఎస్ బొమ్మతోనే.. తెలంగాణలో షర్మిల రాజకీయం చేయడం ఖాయమై పోయింది. అయితే.. తెలంగాణ ప్రజలు ఏమేరకు షర్మిలను రిసీవ్ చేసుకుంటారు? ఏమేరకు అండగా నిలుస్తారు? అనే విషయాలు పక్కన పెడితే.. వైఎస్ తో అనుబంధం ఉన్న నాయకులు షర్మిల వెంట నడుస్తారా? షర్మిల రాజకీయాలకు జై కొడతారా? అనే సందేహాలు వస్తున్నాయి. షర్మిల అరంగేట్రం.. తొలిరోజు సన్నాహక సమావేశానికి మంచి కామెంట్లు వచ్చాయి.
వీటిలో కొన్ని మిశ్రమంగా ఉన్నప్పటికీ.. తీవ్ర వ్యతిరేకత అయితే రాలేదు. అంటే.. విధి విధానాలు ఇంకా తెలియాల్సి ఉన్నందున ఇప్పటికిప్పుడు .. వ్యతిరేకత రాలేదనే అనుకోవాలి. ఇక, నాయకుల పరంగా చూసుకుంటే.. కీలకమైన రెడ్డి, గౌడ సామాజిక వర్గాన్ని గతంలో వైఎస్ పదవులు ఇచ్చి.. వివిధ రూపాల్లో ప్రోత్సహించిన సందర్భాలు ఉన్నాయి. అయితే.. తర్వాత కాంగ్రెస్ పరిస్థితి డోలాయమానంలో పడడం, ఇప్పడు పార్టీ పుంజుకుంటుందో లేదో కూడా తెలియని సందిగ్ధంలో ఉండడంతో రెడ్డి, గౌడ సామాజిక వర్గాలు.. ఒక రాజకీయ శూన్యతను అస్తిత్వాన్ని ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలో కొందరు అందివచ్చిన దారులు పట్టుకుని రాజకీయాల్లో `ఉన్నామని` అంటే ఉన్నామని అనిపించుకుంటున్నారు. మనస్ఫూర్తిగా మాత్రం వారు రాజకీయాలు చేయలేక పోతున్నారు. దీంతో ఒక వేదిక కోసం ఎదురు చూస్తున్న మాట వాస్తవం. ఈ నేపథ్యంలో ఇప్పుడు షర్మిల వైపు చూసే అశకాశం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. అధికార పార్టీలో ఉన్న వైఎస్ అభిమానులు... ఆయన హయాంలో మంత్రి పదవులు పొందిన వారు.. ఇప్పుడు షర్మిల వైపు చూసే అవకాశం కనిపిస్తోంది.
కీలకమైన నాయకులుగా ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, సునీతా లక్ష్మారెడ్డి, దానం నాగేందర్ తో పాటు.. పలువురు నాయకులు వైఎస్‌తో గట్టి సంబంధాలు ఉన్నవారే. ఇప్పుడు వీరు షర్మిల వైపు నడిచే అవకాశం కనిపిస్తోందని..అయితే.. ఇప్పటికిప్పుడు కాదని. అంటున్నారు పరిశీలకులు. షర్మిల దూకుడు, పార్టీని ప్రజలు రిసీవ్ చేసుకునే తీరు.. ఇక్కడి రాజకీయ వాతావరణంలో మార్పులు ఇలా అనేక సమీకరణలుకుదిరితే.. ఖచ్చితంగా షర్మిల వైపు చూసే వారుఉన్నారనేది అధికార పార్టీలోనూ చర్చగా మారింది.