Begin typing your search above and press return to search.
అసలు ఎవరు దేశ ద్రోహులు.?
By: Tupaki Desk | 5 Oct 2019 5:43 AM GMTదేశ ద్రోహం అంటే ఏమిటీ.? దేశంలోనే ఉంటూ ఇక్కడ సౌకర్యాలు అనుభవిస్తూ శతృదేశాలకు సాయం చేసే వారిని దేశ ద్రోహులుగా అభివర్ణిస్తారు. కానీ దేశం గర్వించే మేధావులు, నిపుణులు, రచయితలు, దర్శకులు ఒక సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళితే వారిపై దేశద్రోహం కేసు వేసే విషపు ప్రజాస్వామ్య సంస్కృతి నేడు దేశంలో ప్రజ్వరిల్లిపోతోంది..
ప్రధాని మోడీ గుడిలో దేవుడు కాదు.. ఆయనకు ఎదురిస్తే.. మొరపెట్టుకుంటే శాపాలేమీ పెట్టరు. సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లిన పాపానికి దేశంలోని 50 మంది వివిధ రంగాల్లోని నిష్ణాతులను దేశద్రోహులుగా చిత్రీకరించిన వైనం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
బీజేపీ గద్దెనెక్కాక మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయన్నది వాస్తవం. ఇక మూకదాడులకు లెక్కలేదు.. దళితులు, మైనార్టీల హత్యలు జరిగాయి. వీటిపై అప్పట్లో దేశంలోని 50 మంది వివిధ రంగాల్లోని నిష్ణాతులైన సెలబ్రెటీలు గొంతెత్తారు. ప్రధాని మోడీకి ఘాటుగా లేఖ రాశారు. లేఖరాసిన వారిలో ప్రముఖ మేధావులు రామచంద్ర గుహ, అపర్ణాసేన్, దర్శకుడు మణిరత్నం సహా అదూర్ గోపాల్ కృష్ణన్ - అనురాగ్ కశ్యప్ - శ్యాంబెనగల్ - కొంకణ్ సేన్ శర్మ - సౌమిత్రా చటర్జీ - శుభ ముద్గల్ లాంటి 50మంది హేమాహేమీలున్నారు.
ఈ 50 మంది ప్రముఖులు మోడీకి లేఖ రాయడాన్ని జీర్ణించుకోలేని బీహార్ లోని ముజఫర్ నగర్ కు చెందిన సుధీర్ కుమార్ ఓజీ అనే వ్యక్తి వారిపై ముజఫర్ నగర్ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. దేశ ప్రతిష్టను ఈ 50 మంది ప్రముఖులు మంటగలిపారని.. దేశ ప్రధాని మోడీ అద్భుత పనితీరును నాశనం చేసే విధంగా రాసినలేఖపై సంతకాలు చేశారని.. వీరిపై దేశద్రోహం కేసు పెట్టాలని పిటీషన్ వేశారు.
అయితే దేశద్రోహం లాంటి సీరియస్ కేసులను పర్యవేక్షించే కేంద్రహోంశాఖ కానీ ప్రధాని కార్యాలయం కానీ ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడమే ఇక్కడ దుమారం రేపుతోంది. ఒక తీవ్ర సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళితే దేశద్రోహం వేయడం.. దాన్ని కేంద్రంలోని పెద్దలు సపోర్టు చేసేలా రాజకీయం చేయడాన్ని ఎవ్వరూ సమర్థించడం లేదు.
భారత్ అంటేనే ప్రజాస్వామ్య దేశం.. స్వేచ్ఛా స్వాతంత్ర్యాల దేశం. అలాంటి దేశంలో దేశాధినేతపై గొంతెత్తితే దేశద్రోహం పెట్టడం.. దానికి కేంద్రంలోని పెద్దలు మౌనంగా ఉండడమే దారుణం.. అసమ్మతి - అసంతృప్తి గళాలు దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదపడుతాయి. ఇవే లేకుంటే రాజ్యాధికారంలో ఉన్న వారు మోనార్క్ లా తయారవుతారు. విమర్శలు ఉన్నప్పుడే ప్రజల సమస్యలు వెలుగులోకి వస్తాయి. వ్యక్తి స్వాభిమానం పెరిగిన బీజేపీ పాలనలో గళమెత్తిన వారందరూ దేశద్రోహులైతే దేశ జనాభాలో బీజేపీకి ఓటేయని వారంతా కూడా దేశద్రోహుల కిందే లెక్క. దీన్ని బట్టి 130 కోట్ల జనాభాలో ఎంతలేదన్నా 60 కోట్లకు పైగా దేశద్రోహులే.. మరి వీరిందరినీ బీజేపీ సర్కారు శిక్షిస్తుందా..? గళమెత్తితే నోరు మూయిస్తుందా అన్నది ఇప్పుడు అందరూ లేవనెత్తుతున్న ప్రశ్న..