Begin typing your search above and press return to search.
ఆ నలుగురు లక్కీ నేతలు ఎవరు? వైసీపీలో చర్చ
By: Tupaki Desk | 21 Jan 2022 2:54 AM GMT`ఆ నలుగురు` ఎవరు? జగన్ మనసు దోచుకునే ఆ నలుగురు నేతలు ఎవరు? ఇదీ.. ఇప్పుడు వైసీపీలో హాట్ హాట్‌గా సాగుతున్న చర్చ. దీనికి కారణం.. త్వరలోనే నాలుగు రాజ్యసభ సీట్లు ఏపీలో ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి ఈ సీట్లు దక్కుతాయనే చర్చ వైసీపీలో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం వైసీపీ, బీజేపీ(గతంలో టీడీపీ ఇచ్చినవే)కి సంబంధించిన రాజ్యసభ సభ్యుల్లో నలుగురు తమ పదవీ కాలంపూర్తి చేసుకోనున్నారు. వీరిలో వైసీపీ నుంచి ఒక్క విజయసాయిరెడ్డి మాత్రమే ఉన్నారు.
మిగిలిన ముగ్గురు కూడా గతంలో టీడీపీ తరఫున టికెట్ పొంది..త ర్వాత బీజేపీలో చేరిన టీజీ వెంకటేష్, సుజనా చౌదరి ఉన్నారు. వీరితోపాటు కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు ఒకరు. చంద్రబాబు హయాంలో 2016లో వీరికి టికెట్లు ఇచ్చారు. సురేష్ ప్రభు అప్పట్లోనే బీజేపీలో ఉన్నారు. కేంద్ర మంత్రిగా వ్యవహరిం చారు. ఇక, 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన టీజీ వెంకటేష్‌కు కూడా రాజ్యసభ సీటు ఇచ్చారు. ఇక, పారిశ్రామిక వేత్త, టీడీపీ అధినేత అత్యంత సన్నిహితుడుగా పేరున్న సుజనా చౌదరిని రాజ్యసభకు పంపించి.. మంత్రి పదవిని ఇప్పించారు.
ఇక, వీరిపదవీకాలం ఈ ఏడాది జూన్‌తో తీరిపోతుంది. దీంతో ఇప్పుడు ఈ నాలుగు సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే.. ఈ నాలుగు సీట్లు కూడా ఈ దఫా అసెంబ్లీలో భారీ మెజారిటీ ఉన్న వైసీపీకే దక్కనున్నాయి. సో.. ఇప్పుడు ఈ నాలుగు స్థానాలను ఎవరికి ఇస్తారు? అనే చర్చ జోరుగా సాగుతోంది. వీటిలో సాయిరెడ్డిని యథాతథంగా కొనసాగిస్తారనే చర్చ సాగుతోంది. అయితే.. ఆయనమాత్రం తాను విశాఖ ఎంపీగా పోటీ చేయాలని యోచిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఆయన ను కూడా తప్పిస్తే.. ఆ నలుగురు ఎవరు అనే చర్చ జోరుగా సాగుతోంది.
ఈ దఫా వచ్చే 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ సమీకరణలకు సీఎం జగన్ ప్రాధాన్యం ఇస్తారని అంటున్నారు. ఇప్పటి వరకు ముస్లిం సామాజిక వర్గానికి ఏ పార్టీ కూడా రాజ్యసభ సీటు ఇవ్వలేదు. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానిక, ఎస్టీలకు కూడా దక్కలేదు. ఈ క్రమంలో రెండు సీట్లను మైనారిటీ ముస్లింకు.. ఒకటి, ఎస్సీ, లేదా ఎస్టీ వర్గానికి ఒకటి కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఇక, మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి కేంద్రంలోని పెద్దల కకోరిక మేరకు..వారు సూచించే ఉత్తరాది వారికి లేదా.. కేంద్రంలో మంత్రికి ఒకరి కి కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. మరో సీటు ఒక్కటే.. ఇప్పుడు.. ఇతర సామాజిక వర్గాలకు కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. దీనికి.. బీసీల నుంచి పోటీ ఉందని తెలుస్తోంది. మరి ఏం చేస్తారోచూడాలి.