Begin typing your search above and press return to search.

బీజేపీ లోకి వెళ్ళబోతున్న ఆ టీడీపీ వియ్యంకులు ఎవరంటే ?

By:  Tupaki Desk   |   14 Nov 2019 9:23 AM GMT
బీజేపీ లోకి వెళ్ళబోతున్న ఆ టీడీపీ వియ్యంకులు ఎవరంటే ?
X
ఏపీ లో రాజకీయం హాట్ హాట్ గా సాగి పోతుంది. ఎవరి దారి వారిదే అన్నట్టు ముందుకు పోతున్నారు. కొందరు ప్రజా సమస్యల పై పోరాడుతుంటే ..మరి కొందరు మాత్రం తమ సమస్యల పై పోరాటం చేస్తున్నారు.ఇక ప్రస్తుతం ఏపీ లో టీడీపీ పరిస్థితి ఏ మాత్రం బాగా లేదు. టీడీపీ చరిత్ర లో ఎన్నడూ చూడనటువంటి ఘోర పరాజయాన్ని ఈ ఎన్నికల లో చవి చూసింది. రాష్ట్రం మొత్తం 175 స్థానాల లో పోటీ చేస్తే కేవలం 23 చోట్ల మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. దీనితో ఇక టీడీపీ లో ఉంటే తమ రాజకీయ భవిష్యత్ అంధకారమే అని నేతలు పక్క చూపులు చూస్తున్నారు.

ఇప్పటికే కొంతమంది బీజేపీ లోకి వెళ్లి పోయారు. మరికొంతమంది వైసీపీ లోకి వెళ్ళడానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక పోతే తాజాగా టీడీపీ లో ఇద్దరు మాజీ మంత్రుల వ్యవహారం ఎవరికీ అంతు పట్టడం లేదు. మంత్రులు గా ఉన్న సమయం లో ఒక వెలుగు వెలిగిన ఆ ఇద్దరు నేతలు ..ప్రస్తుతం సైలెంట్ అయి పోయారు. వియ్యంకులైన ఆ ఇద్దరు కీలక నేతలు పార్టీ కార్యక్రమాల కు దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు పార్టీ లో రాజ భోగాలు అనుభవించిన ఆ ఇద్దరూ ఇప్పుడు పార్టీ కోసం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఆ ఇద్దరు ఎవరంటే .. గంటా శ్రీనివాస రావు, పి.నారాయణ.

చంద్రబాబు సీఎం గా ఎన్నికైన తరువాత పార్టీ లో గంటా, నారాయణలు అంతా తామే అన్నట్లు గా వ్యవహరించారు. ఇక 2019 ఎన్నికల లో వీరి లో నారాయణ ఎన్నికల్లో ఓడిపో గా... గంటా శ్రీనివాస రావు మాత్రం ఎమ్మెల్యే గా విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి పార్టీ తో అంటీ ముట్టనట్టుగా వ్యవహరించే విషయం లో మాత్రం ఇద్దరూ ఓకే రకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరి రాజకీయం ఎవరికీ అంతు పట్టడం లేదు. గంటా ఈరోజో రేపో టీడీపీ కి గుడ్ బై చెప్పేస్తారంటూ ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ ఆయన పార్టీ లోనే కొనసాగుతున్నారు. అలా అని పార్టీ లో తిరగడమూ లేదు. తాజాగా ఆయన తన వియ్యంకుడినీ తనతో పాటు తీసుకెళ్తారన్న కొత్త ప్రచారం ఒకటి మొదలైంది.

ప్రస్తుతం గంటా పార్టీ మారడం దాదాపు ఖాయమనే టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే క్లారిటీ వస్తుందని విశాఖ జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీడీపీ వర్గాలు సైతం గంటా తమ పార్టీ లో ఉంటారో లేదో తెలియదని చర్చించుకుంటున్నాయి. తాజాగా గంటా బీజేపీ కీలక నేత సోము వీర్రాజు ని కలవడం తో ఈ వార్తల కి మరింత బలం చేకూరింది. ఇక నారాయణ ఎన్నికల లో ఓడిపోయిన తరువాత పూర్తి గా తన వ్యాపారాల కే పరిమితమై పోయారు. ఇటీవల టీడీపీ నాయకులు అమరావతి లో పర్యటించినప్పుడు వారితో కనిపించారు. మళ్లీ తరువాత కనిపించ లేదు . కానీ , గంటాతో పాటు గా నారాయణ కూడా బీజేపీ లోకి వెళ్ళడానికి సిద్దమౌతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.