Begin typing your search above and press return to search.

దుర్భరంగా అమెరికా వీసా స్లాట్లు .. దొరికేదెన్నడు?

By:  Tupaki Desk   |   21 Dec 2022 8:38 AM GMT
దుర్భరంగా అమెరికా వీసా స్లాట్లు .. దొరికేదెన్నడు?
X
అమెరికా వీసా ఇప్పుడు దొరకడం కానా కష్టమవుతోంది. స్లాట్లు లభించక.. విద్యార్థులు అయోమయంలో పడుతున్నారు. అమెరికాలో ఉన్నత చదువులకు గాను వీసా ఇంటర్వ్యూ అపాయింట్ మెంట్ దొరకడం పలువురికి అందని ద్రాక్షగా మారింది. పరిమితంగా వీసా స్లాట్లు జారీ చేయడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎదురుచూపులులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు తరగతుల ప్రారంభ సమయం సమీపిస్తుండడంతో అమెరికా వెళ్లగలమా? లేదా? అన్న అయోమయంలో వారంతా కొట్టుమిట్టాడుతున్నారు.

అర్జంట్ పనిమీద వెళ్లాలంటే ఆశలు వదులుకోవాల్సిందే. ఎందుకంటే వెయిటింగ్ పీరియడ్ ఏకంగా 3 ఏళ్లకు చేరింది. భారత్ తమ ప్రజాస్వామ్య మిత్రదేశం అంటూ భారతీయులకు మాత్రం వీసా ఇవ్వడానికి ఏకంగా మూడేళ్లు ఎదురుచూసేలా చేస్తోంది. భారత్ ను ఒకలాగా.. కుట్రకారు చైనాను మరోకలాగా చూస్తోంది. చైనాలో ఈ వెయిటింగ్ పీరియడ్ కేవలం 3 రోజులే కావడం గమనార్హం. దీనిపైనే అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆన్ లైన్ పిటీషన్లు, ఇతర మార్గాల్లో లేఖల యుద్ధం మొదలుపెట్టారు.

అమెరికాకు వ్యాపారం (B-1) నిమిత్తం.., టూరిస్ట్ (B-2) వీసాల కోసం మొదటిసారి దరఖాస్తు చేసుకున్నవారికి, ఇప్పుడు వేచి ఉండే సమయం దాదాపు మూడు సంవత్సరాల వరకు చేరింది. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ మంగళవారం "పర్యాటక వీసా (B1/B2) ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ కోసం గ్లోబల్ మధ్యస్థ నిరీక్షణ సమయం ఈ నెల నాటికి రెండు నెలలలోపు ఉంది" అని పేర్కొంది.

భారతదేశంలో మాత్రం అమెరికా వీసాల కోసం నిరీక్షణ సమయం అనూహ్యంగా ఎక్కువగా ఉంది. దేశం పోస్ట్ మహమ్మారి తర్వాత ఉద్యోగుల తొలగింపుతో అప్లికేషన్ ప్రాసెసింగ్‌ను తిరిగి ప్రారంభించింది. ఉద్యోగుల కొరతతో అది పెరుగుతూనే ఉంది.అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకారం ముంబైలో ఇంటర్వ్యూ అవసరమయ్యే B1/B2 దరఖాస్తుదారుల కోసం ప్రస్తుత నిరీక్షణ వ్యవధి 999 రోజులు; హైదరాబాద్‌లో 994 రోజులు; ఢిల్లీలో 961 రోజులు; చెన్నైలో 948, కోల్‌కతాలో 904గా ఉంది..

విజిటర్ వీసా దరఖాస్తుదారులు లేదా భారతదేశంలో డ్రాప్ బాక్స్ అప్లికేషన్ (ఇంటర్వ్యూ మినహాయింపు) కోసం అర్హత పొందని ఇతరుల కోసం వెయిటింగ్ పీరియడ్ మొదటిసారిగా మూడు సంవత్సరాలు దాటుతోంది. కాబట్టి, మొదటిసారి B1/B2 దరఖాస్తుదారు 2025 చివరిలో మాత్రమే ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ పొందగలరు.

వీసా ఇంటర్వ్యూకు హాజరై విఫలమైన వారికి మరో అవకాశం కల్పిస్తామని అమెరికా రాయబార కార్యాలయం చెబుతున్నా అది సీజన్ ప్రారంభానికి ముందే ప్రకటించింది. సాధారణంగా వీసా ఇంటర్వ్యూకు ఎన్ని దఫాలైనా హాజరయ్యే అవకాశం ఉంటుంది. అయితే గత విద్యాసంవత్సరం నుంచి ఒక సీజన్ లో ఒక దఫా మాత్రమే ఇంటర్వ్యూ స్లాట్ పొందేలా సాఫ్ట్ వేర్ లో అమెరికా ప్రభుత్వం మార్పులు చేసింది. దీంతో ప్రత్యేకంగా స్లాట్స్ విడుదల చేస్తే తప్ప రెండో దఫా ఇంటర్వ్యూకు అవకాశం పొందలేని పరిస్థితి.

స్టాట్ లభించనిపక్షంలో ఆయా విద్యాసంస్థలను సంప్రదించి వచ్చే ఏడాది ప్రవేశం పొందేలా ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేస్తోంది. భారతీయ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని.. వచ్చే విద్యాసంవత్సరంలో వీసాలను 10 శాతం పెంచి మరింతమందికి అవకాశం కల్పిస్తామని రాయబార కార్యాలయం ప్రకటించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.