Begin typing your search above and press return to search.

మరికొన్ని రోజుల్లో కరోనా విశ్వరూపం ..WHO షాకింగ్ ప్రకటన !

By:  Tupaki Desk   |   22 April 2020 6:50 AM GMT
మరికొన్ని రోజుల్లో కరోనా విశ్వరూపం ..WHO షాకింగ్ ప్రకటన !
X
కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అయితే లాక్ డౌన్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా నుంచి నిదానంగా బయట పడుతున్నామన్న సంకేతాలు కనిపిస్తున్నాయని చాలా దేశాలు అంటున్న సమయంలో , వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ అసలు రూపం ఇంకా బయటకి రాలేదు అని, ముందు ముందు దీని తీవ్రత మరింత ఉధృతంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ వ్యాఖ్యానించారు.

మమ్మల్ని నమ్మండి, ముందు ముందు మరింత ఉత్పాతం రాబోతోంది. ఈ విషాదాన్ని మనం కలిసికట్టుగా ఆపాలి. ఈ వైరస్‌ గురించి ఇంకా చాలామందికి అర్థం కాలేదు అని అయన తెలిపారు. డబ్ల్యూహెచ్‌ వో దగ్గర ఎలాంటి రహస్యాలు లేవనీ... ఇలాంటి విషయాలను గోప్యంగా ఉంచడం పెను ప్రమాదమని ఆయన స్పష్టం చేశారు. ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయమని ఆయన గుర్తుచేశారు. అలాగే లాక్ డౌన్ ను చాలా కాలం కొనసాగించలేమని చెప్పిన అయన , ముందుముందు వైద్య సదుపాయాలూ తక్కువగా ఉన్న తక్కువగా అభివృద్ధి చెందిన ఆఫ్రికా దేశాల్లో కరోనా మరణమృదంగం సృష్టించనుందని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ అంచనా వేసిందని టీడ్రాస్ తెలిపారు.

కరోనాకు, 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ కి ఎన్నో సారూప్యాలున్నాయని, స్పానిష్ ఫ్లూ తరహాలోనే, కరోనా సైతం నిదానంగా పంజా విసిరి ప్రాణాలు తీస్తుందని హెచ్చరించారు. మహమ్మారి విశ్వరూపం ముందు ముందు చూపించే అవకాశం ఉందని ఈ దురదృష్టాన్ని నివారించేందుకు అన్ని దేశాలూ కలిసి పోరాటం చెయ్యాలని టీడ్రాస్ పిలుపునిచ్చారు.

ఎన్నో దేశాల్లో కరోనా ఇప్పుడిప్పుడే పంజా విసరడం ప్రారంభించిందని, కొన్ని దేశాల్లో నియంత్రణా చర్యల మూలంగా కొంత మేరకు నిదానించిందని గుర్తు చేసిన ఆయన, కరోనా మళ్ళీ తన విశ్వరూపం చూపిస్తుందని అయన అన్నారు. కాగా ఇప్పటికే 25 లక్షల మందికి పైగా కరోనా భారిన పడి ప్రాణాలతో పోరాడుతున్నారు ..అలాగే 1.77 లక్షల మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు.