Begin typing your search above and press return to search.

డ‌బ్ల్యూహెచ్ఓ మ‌రో షాకింగ్ ప్ర‌క‌ట‌న‌: మ‌రో ఏడాది వైర‌స్ తో పోరాటం

By:  Tupaki Desk   |   25 July 2020 3:00 PM GMT
డ‌బ్ల్యూహెచ్ఓ మ‌రో షాకింగ్ ప్ర‌క‌ట‌న‌: మ‌రో ఏడాది వైర‌స్ తో పోరాటం
X
మాన‌వ ప్ర‌పంచాన్ని క‌ల్లోలం రేపుతున్న మ‌హ‌మ్మారి వైర‌స్ ఎంత‌కీ క‌ట్ట‌డి కావ‌డం లేదు. అగ్ర దేశాల‌తో పాటు అన్ని దేశాలు కూడా ఆ వైర‌స్‌తో తీవ్రంగా ప్ర‌భావిత‌మవుతున్నాయి. ఆ వైర‌స్ కొద్ది రోజుల్లో త‌గ్గుముఖం ప‌డుతుంద‌నే ఆశ‌తో ప్ర‌జ‌లంద‌రూ జాగ్ర‌త్త‌లు పాటిస్తూ కొంచెం ధైర్యంగా ఉంటున్నారు. ఈ వైర‌స్‌పై నిరంత‌రం అధ్య‌య‌నం చేస్తున్న ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తాజాగా మ‌రో షాకింగ్ విష‌యం చెప్పింది. ఇన్నాళ్లు వ్యాక్సిన్ పై ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న డ‌బ్ల్యూహెచ్ఓ తాజాగా వైర‌స్ ఎప్ప‌టివ‌ర‌కు ఉంటుంద‌నే దానిపై అధ్య‌య‌నం చేసింది. ఈ సంద‌ర్భంగా వైర‌స్‌పై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. వైర‌స్ ఇప్ప‌ట్లో కాదు కదా మ‌రో సంవ‌త్స‌రం పాటు ఆ వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతుంద‌ని తెలిపింది. మ‌రో ఏడాది పాటు వైర‌స్‌తో పోరాటం చేసేందుకు సిద్ధం కావాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ పిలుపునిస్తోంది.

డ‌బ్ల్యూహెచ్ఓ సోషల్ మీడియా ద్వారా ఏర్పాటుచేసిన వర్చువల్ సమావేశంలో ఆ సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్ట‌ర్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడారు. ఈ ఏడాది చివరకు క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసుకుని వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. కోట్ల కొద్దీ టీకాలను పంపిణీ చేసేందుకు మరింత సమయం ప‌డుతుంద‌ని వివ‌రించారు. ఈ నేప‌థ్యంలోనే మ‌రో ఏడాది పాటు వైర‌స్‌తో పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా వైర‌స్‌ను కట్టడి చేసే రోగ నిరోధక శక్తి సహజంగా వ్యాపించాలంటే.. వైరస్ పలుమార్లు సమాజంపై తీవ్ర ప్రభావం చూపించాల్సి ఉంటుందని పేర్కొ‌న్నారు. ఏదైనా ప్రాంతంలోని కనీసం 60 శాతం మందిలో వైర‌స్‌ను ఎదిరించగలిగే రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెందిన‌ప్పుడే దానిపై పైచేయి సాధించిన‌ట్టు అవుతుంద‌ని తెలిపారు. వైర‌స్‌కు విరుగుడుగా వ్యాక్సిన్ తీసుకురావ‌డానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే వ్యాక్సిన్ వ‌స్తుంద‌ని ఆశిస్తున్న ప్ర‌జ‌ల‌కు ఈ ప్ర‌క‌ట‌న కొంత ఆందోళ‌న క‌లిగించే విష‌యం.