Begin typing your search above and press return to search.
భారత్ లో ఇంకా ఆ దశ ప్రారంభం కాలేదు..!
By: Tupaki Desk | 10 April 2020 2:00 PM GMTభారతదేశంలో కరోనా వ్యాధి సమూహ వ్యాప్తి దశకు చేరుకుందని ప్రకటించి యావత్ 135 కోట్ల మంది భారతీయుల్లో కలవరం రేపిన ప్రపంచ ఆరోగ్యం సంస్థ , భారత్ లో కరోనా వ్యాప్తిని అంచనా వేయడంలో విఫలం అయినట్టు తాజాగా వివరణ ఇచ్చింది. భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ లెవల్ (మూడో దశ) కు చేరుకోలేదని తాజాగా శుక్రవారం వెల్లడించింది. దీనితో భారత్ సేఫ్ జోన్ లోనే వుందని ప్రకటించింది. తమ నివేదికలో తప్పిదం జరిగిందని డబ్ల్యూహెచ్ ఓ అంగీకరించింది.
చైనా లో మొదలైన కరోనాను ఆలస్యంగా గుర్తించి.. ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో, అలసత్వం వహించిన WHO ఇంకా తమ తప్పులను కొనసాగిస్తూనే వుంది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థ పనితీరును తప్పుపడుతున్న తరుణంలోనే ..తప్పు మీద తప్పు చేస్తుంది. డబ్ల్యూహెచ్ ఓ వెల్లడించిన నివేదికలో భారత్‌కు సంబంధించిన కాలమ్ లో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ అని పేర్కొనగా, చైనాలో క్లస్టర్ కేసులు నమోదవుతున్నట్టు తెలిపింది. దీనిపై డబ్ల్యూహెచ్ ఓ వివరణ ఇస్తూ నివేదికలో దొర్లిన పొరపాటును సవరించింది. మరోవైపు భారత్ లో కరోనా మహమ్మారి మూడో దశ లేదా సమూహ వ్యాప్తి దశలో ఉందనే వార్తలను భారత్ తోసిపుచ్చింది.
ఇకపోతే ఇప్పటివరకు భారత్ లో 6725 పాజిటివ్ కేసులు నమోదుకాగా 229 మంది మరణించారు. గత 24 గంటల్లో 30 మందికి పైగా మృత్యువాతన పడ్డారు. దేశంలో మూడువారాల పాటు లాక్‌డౌన్ అమలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా కరోనా కొంత కట్టడిలోకి వచ్చింది అని వైద్యులు, అధికారులు, నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు లాక్ డౌన్ ను అమలు చేయాలంటూ కేంద్రాన్ని పలు రాష్ట్రాలు కోరుతున్నాయి.